Saturday, April 27, 2024

రెండో విడత గొర్రెల పంపిణీపై సిఎం కెసిఆర్ సమీక్ష

- Advertisement -
- Advertisement -

CM KCR review on second installment sheep distribution

హైదరాబాద్: రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంపై సిఎం కెసిఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. బిసి వర్గాల అభ్యున్నతి, ప్రభుత్వ కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఇప్పటికే మొదటి విడత ద్వారా 5000 కోట్ల రూపాయాలు ఖర్చుతో చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలనిచ్చిందని, ఈ నేపథ్యంలో రెండో విడత పంపిణీకోసం మరో రూ.6 వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు సిఎం తెలిపారు. అందుకు కావాల్సిన నిధులను సమకూర్చాలని ఆర్థిక శాఖ ను సిఎం ఆదేశించారు. దీంతో మొదటి విడత తో పాటు రెండో విడతను కలుపుకుని తెలంగాణ గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమాల కోసం మొత్తంగా 11,000 కోట్ల రూపాయలను కేటాయించినట్లవుతుంది. అంతేకాకుండా… ఇప్పుడు అందిస్తున్న గొర్రెల యూనిట్ ను అదే సంఖ్యతో కొనసాగించాలని సిఎం స్పష్టం చేశారు. దాంతో పాటు యూనిట్ (20+1) ధరను పెంచాలని సిఎం నిర్ణయించారు.

 

CM KCR review on second installment sheep distribution

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News