Saturday, April 27, 2024

షోరూమ్ నిర్వాహకుల నిర్లక్ష్యం…. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందపడిన కారు….

- Advertisement -
- Advertisement -

Car fell from first floor in LB Nagar

ఎల్‌బి నగర్: కారు షో రూమ్ నిర్లక్ష్యంతో పాటు కొనుగోలుదారు అజాగ్రత్తతో కారు మొదటి అంతస్థు నుంచి కిందపడిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఎల్‌బి నగర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మేడిపల్లి చెందిన భగవత్ అనే వ్యక్తి ఎల్‌ఐసిలో పని చేస్తున్నాడు. కారు కొనుగోలు చేయడానికి అల్కాపురి చౌరస్తాలోని టాటా కారు షోరూమ్‌కు భగవత్ వచ్చాడు. టాటాటియాగో ఎస్‌టి 1.2 కారును కొనుగోలు చేశాడు. కారు మొదటి అంతస్థు నుంచి కిందకు ఓపెన్ లిప్టులో దింపుతుండగా భగవత్  కారును ముందుకు డ్రైవ్ చేయడంతో అక్కడ నుంచి కిందపడిపోయింది. ఈ ఘటనలో బైక్, మరో కారు పూర్తి ధ్వంసమయ్యాయి. బాధితుడు చిన్నపాటి గాయాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. వెంటనే ఎల్‌బి నగర్ పోలీస్ స్టేషన్‌లో భగవత్ ఫిర్యాదు చేశాడు. టాటా కార్ల షోరూమ్‌ జిహెచ్‌ఎంసి అనుమతులు లేకుండా నడుస్తోందన్నారు. ఓపెన్ లిఫ్టు ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, ఓపెన్ లిఫ్టుకు కూడా అనుమతులు లేవన్నారు. టాటా కార్ల షోరూమ్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులు, జిహెచ్‌ఎంసి అధికారులను కోరారు. భగవత్‌కు కారు డ్రైవింగ్ రాకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని షోరూమ్ నిర్వహకులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News