Friday, May 3, 2024

అల్లరి నరేష్ ‘నాంది’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అల్ల‌రి న‌రేష్‌ కథానాయకుడిగా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ నాంది. నరేష్ 57వ మూవీగా రూపొందిన ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు శనివారం నాంది ట్రైల‌ర్‌ను తన ట్వీట్టర్ ఖాతా ద్వారా విడుద‌ల చేసి చేశారు.నాంది మూవీ సూపర్ హిట్ కావాలని ఆశిస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఏ తప్పు చేయకుండానే జైలు శిక్ష అనుభ‌వించే వ్య‌క్తి పాత్ర‌లో అల్ల‌రి న‌రేష్ న‌టించారు. జైలు సన్నీవేశాలు ఆసక్తికరంగా రూపొందించారు. మొత్తానికి ట్రైలర్ తో మూవీపై అంచనాలు పెంచేశాడు నరేష్. ఈ చిత్రంలో తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తోంది. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Allari Naresh’s ‘Nandi’ Trailer launched by Mahesh Babu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News