Monday, April 29, 2024

బెన్ స్టోక్స్ ఔట్‌.. భారీ స్కోరు దిశగా ఇంగ్లండ్

- Advertisement -
- Advertisement -

Ben Stokes out at 82 against India

చెన్నై: చెపాక్ వేదికగా టీమిండియాతో జ‌రుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజు భార‌త్ పై పైచేయి సాధించిన ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్స్ రెండో రోజూ కూడా దూకుడుగా ఆడుతున్నారు. ఈ క్రమంలో జో రూట్ భారీ శతకంతో క్రీజులో పాతుకుపోయాడు. మరోవైపు బెన్ స్టోక్స్ దూకుడు బ్యాటింగ్ చేశాడు. దీంతో వీరిద్దరూ నాలుగ‌వ వికెట్‌కు 124 ర‌న్స్ జోడించారు. దీంతో ఇంగ్లండ్ భారీ స్కోరు వైపు దూసుకుపోతుంది. ఈ క్రమంలో సెంచరీకి చేరువైన బెన్ స్టోక్స్(82)ను స్పిన్న‌ర్ న‌దీమ్ పెవిలియన్ చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పోప్(7)తో కలిసి జోరూట్(177) నిలకడగా ఆడుతున్నాడు. దీంతో ఇంగ్లండ్ 135 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 404 ర‌న్స్ చేసింది.

Ben Stokes out at 82 against India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News