Tuesday, April 30, 2024

తప్పులో కాలేసిన అమెజాన్

- Advertisement -
- Advertisement -
Amazon mistakenly lists high-end AC for Rs 5900
రూ.96 వేల ఎసిని రూ.5,900గా పేర్కొనడంతో ఆర్డర్ల వెల్లువ

న్యూఢిల్లీ : ఆన్‌లైన్ దిగ్గజం అమెజాన్ ఒక వస్తువు విషయంలో తప్పు చేసి నాలిక్కరుచుకుంది. అమెజాన్ అనుకోకుండా ప్రీమియం తొషిబా ఇన్వర్టర్ స్లిట్‌పై 94 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఇది డిస్కౌంట్ ధర లిస్టింగ్‌లో తప్పిదం వల్ల జరిగింది. మొత్తం డిస్కౌంట్ రూ.5,900 ఇవ్వాల్సి ఉంది, కానీ పొరపాటున ఏసి ధరనే రూ.5900గా తగ్గిస్తూ ఇచ్చారు. అదే విధంగా ఆఫర్‌లో భాగంగా ఆటోమెటిక్‌గా నెలసరి వాయి దా రూ.278 చెల్లించవచ్చని అందులో ఇవ్వ డం జరిగింది. ఈ తప్పిదం గుర్తించే లోపే పెద్ద మొత్తంలో ఆర్డర్లు వెల్లువెత్తాయి. వెంటనే అమెజాన్ తప్పును సరిచేసింది. అయితే ఇప్పటికే వేలాది మంది బుకింగ్‌లు చేసుకున్నారు. వారికి కంపెనీ ఏం సమాధానం చెబుతుందో? తెలియరాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News