Tuesday, May 14, 2024

అమెజాన్ ప్రైమ్ యూజర్లకు గుడ్‌న్యూస్

- Advertisement -
- Advertisement -

Amazon Prime Monthly Plan Is Back

న్యూఢిల్లీ: మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలనుకుంటున్నారా అయితే… మీకు గుడ్‌న్యూస్…! అమెజాన్ ప్రైమ్ యూజర్లను దృష్టిలో ఉంచుకొని అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైమ్ మెంబర్‌షిప్ నెలవారి సబ్‌స్క్రిప్షన్ సేవలను తిరిగి అమెజాన్ ప్రారంభించింది. దీంతో కొత్తగా ప్రైమ్ మెంబర్‌షిప్ సేవలను ప్రయత్నించే వారికి కాస్త ఉపశమనం కలగనుంది. ప్రైమ్ మెంబర్‌షిప్ సేవలను నెల రోజుల పాటు పొంది, నచ్చకపోతే ప్రైమ్ మెంబర్‌షిప్ వెంటనే రద్దు చేసుకోవచ్చును. రిజర్వ్ బ్యాంకు నియమాకాల ప్రకారం అమెజాన్ నెల వారి సబ్‌స్క్రిప్షన్ సేవలను ఈ ఏడాది ప్రారంభంలో తీసివేసింది. దీంతో యూజర్ల కోసం కేవలం త్రైమాసిక, వార్షిక సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్ 1 నుంచి ఆటో డెబిట్ కార్డు రూల్స్‌పై రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. పునరావృతమయ్యే లావాదేవీలపై ఆర్‌బిఐ కట్టడి చేసింది. దీంతో తిరిగి వన్ మంత్ సబ్‌స్క్రిప్షన్‌ను అమెజాన్ ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. వన్ మంత్ సబ్‌స్క్రిప్షన్ కేవలం సెలక్టెడ్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులతోనే పొందవచ్చును. నెట్‌ఫ్లిక్స్ తరహాలో ఉచిత వన్ మంత్ ట్రయల్ సబ్‌స్క్రిప్షన్‌ను అమెజాన్ తీసివేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News