Friday, April 26, 2024

గంగానదిలో శవాలు అంబులెన్స్‌లు గుమ్మరించినవే

- Advertisement -
- Advertisement -

Ambulances piled up corpses in the Ganges

బీహార్, యుపి రాష్ట్రాల ప్రజల ఆందోళన

పాట్నా :ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల సరిహద్దులో గంగానదిలో సోమవారం కుప్పలు తెప్పలుగా కొవిడ్ రోగుల శవాలు తేలియాడడం రెండు రాష్ట్రాల ప్రజల్లో ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే. బీహార్ లోని బక్సర్ వద్ద గంగా నదీ తీరానికి కొట్టుకు వచ్చిన 71 శవాలు చాలావరకు కుళ్లిపోయి ఉన్నాయని, ఇవన్నీ ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చినవేనని బీహార్ అధికారులు ఆరోపించారు. అంబులెన్స్‌లతో వచ్చిన డ్రైవర్లు బ్రిడ్జిపై నుంచి శవాలను నది లోకి విసిరి పారేసే దృశ్యాలు మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉత్తర ప్రదేశ్ బలియా సరిహద్దులోని బీహార్ శరణ్ ప్రాంతం జయప్రభ సేతు బ్రిడ్జిపై నుంచి అంబులెన్సుల డ్రైవర్లు కొవిడ్ రోగుల శవాలను గుమ్మరిస్తున్నారని బీహార్ బిజెపి ఎంపి జనార్దన్ సింగ్ సిగ్రివాల్ ఆరోపించారు.

అంబులెన్సు డ్రైవర్లు శవాలను గుమ్మరించకుండా చూడాలని శరణ్ జిల్లా యంత్రాంగాన్ని కోరినట్టు ఆయన చెప్పారు. అయితే స్థానికులు మాత్రం రెండు రాష్ట్రాలు ఇలాగే వ్యవహరిస్తున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల అంబులెన్సు డ్రైవర్లు ఇలాగే శవాలను గుమ్మరించుకుపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బక్సర్ జిల్లా చౌసా గ్రామం వద్ద నదిలో తేలి శ్శశాన వాటిక వద్దకు తీరానికి కొట్టుకు వచ్చాయి. ఆ మృతదేహాలను ఒడ్డుకు చేర్చి రాత్రంతా పోస్టుమార్టమ్ చేసినట్టు బక్సర్ జిల్లా అధికారులు తెలిపారు. మృతులను గుర్తించ డానికి డిఎన్‌ఎ సేకరించామని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News