Sunday, April 28, 2024

ఎన్నికల్లో రిగ్గింగ్‌తో మూడో ప్రపంచ దేశంగా అమెరికా: డొనాల్డ్ ట్రంప్

- Advertisement -
- Advertisement -

America as third world country with Election rigging

 

వాషింగ్టన్: అమెరికా మూడో ప్రపంచ దేశంగా మారిందంటూ డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి ఎన్నికల ఫలితాల పట్ల తన అసంతృప్తిని మరోసారి వెల్లగక్కారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరగడం దేశ గౌరవాన్ని తగ్గించిందని ట్రంప్ అన్నారు. రెజ్లర్ డ్యాన్ గేబుల్‌కు ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డును ప్రదానం చేసే సందర్భంగా వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. బ్యాలెట్ ఓట్ల లెక్కలన్నీ తప్పుల తడక అని ట్రంప్ అన్నారు. వేలాది ఓట్లు తనకు వ్యతిరేకంగా పడేలా చేశారని ట్రంప్ అన్నారు. మరో రెండు రోజుల్లో అనూహ్య సంఘటనలు జరుగుతాయని ట్రంప్ అన్నారు. అయితే, ట్రంప్ ఆరోపణల్ని ఎన్నికల అధికారులు, ప్రధాన మీడియా సంస్థలు తిరస్కరిస్తున్నాయి. అంతేగాక పలు రాష్ట్రాల్లో ట్రంప్ వేసిన కేసులు వీగిపోయాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News