Wednesday, May 1, 2024

హువావేపై అమెరికా తాజా ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

America latest sanctions on Huawei

 

బోస్టన్: దీర్ఘకాలంగా చైనాతో వాణిజ్యయుద్ధం కొనసాగిస్తున్న అమెరికా దానితో తన పోరును మరింత పెంచింది. చైనా టెక్నాలజీ దిగ్గజం హువావేపై అమెరికా ప్రభుత్వం కొత్తగాఆంక్షలు విధించింది. దీంతో అమెరికా టెక్నాలజీని ఆ సంస్థ ఉపయోగించుకోవడం కష్టమవుతుంది. విదేశాల్లో సెమీ కండక్టర్లను తయారు చేయడానికి అమెరికా టెక్నాలజీని ఉపయోగించకుండా గతంలో విధించిన ఆంక్షలను హువావే కంపెనీ ఉల్లంఘించకుండా చూడడం కోసమే ఈ తాజా ఆంక్షలను విధించినట్లు అమెరికా వాణిజ్య శాఖ మంత్రి విల్బర్ రాస్ తెలిపారు. సాంకేతికపరమైన భారీ లోపం ఉందని, దాన్ని ఆధారం చేసుకొని హువావే అమెరికా టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకుంటోందని ఆయన చెప్పారు. ఆ లూప్‌హోల్ అలాగే కొనసాగాలని తాము అనుకోవడం లేదని ఆయన స్పష్ట చేశారు. చైనాకు చెందిన హువావే సంస్థ ప్రపంచవ్యాప్తంగా నెట్‌వర్క్ పరికరాలను, స్మార్ట్‌ఫోన్లను తయారు చేయడం ద్వారా అమెరికా కంపెనీలకు పోటీగా ఎదిగింది. గతంలో కూడా ట్రంప్ ఈ సంస్థ అమెరికా భద్రతకు ముప్పన్న కారణంగా దానిపై ఆంక్షలు విధించారు.

అయితే హువావే సంస్థ ట్రంప్ ఆరోపణలను తోసిపుచ్చింది. కాగా అమెరికా కంపెనీలకు దీటుగా ఎదగడాన్ని ఓర్వలేకనే ట్రంప్ ప్రభుత్వం భద్రతా కారణాలను చూపి చైనా కంపెనీలపై ఆంక్షలు విధిస్తోందని అప్పట్లో చైనా ప్రభుత్వం ఆరోపించింది. కాగా తాజా ఆంక్షలతో అమెరికా టెక్నాలజీని ఉపయోగించి సెమీ కండక్టర్లను డిజైన్ చేసిన హువావేకు సెమీ కండక్టర్లను ఎగుమతి చేసే విదేశీ కంపెనీలు ముందుగా అమెరికా లైసెన్స్‌ను పొందాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్ ప్లాంట్లలో ఉపయోగించే చిప్ డిజైన్, తయారీ పరికరాలు చాలా వరకు అమెరికాలో తయారైనవే. ఇప్పుడు ఈ కొత్త నిబంధనలతో హువావే, దాని అనుబంధ సంస్థ సంస్థలకు సెమీ కండక్టర్లను ఎగుమతి చేసే విదేశీ కంపెనీలకు ఇబ్బందులు తప్పవని నిపుణులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News