Monday, April 29, 2024

మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీటిని అందించాలి

- Advertisement -
- Advertisement -

Provide fresh water through Mission Bhagiratha scheme

 

వివిధ జిల్లాల ఎస్సీ, ఈఈలతో మంత్రి ఎర్రబెల్లి సమీక్ష

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రజల డిమాండ్‌కనుగుణంగా, ప్రజావసరాలను తీర్చేవిధంగా మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీటిని అందించాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని మిషన్ భగీరథ (గ్రామీణ మంచినీటి పథకం) కార్యాలయం నుంచి రాష్ట్రంలోని వివిధ జిల్లాల ఎస్సీ, ఈఈలతో మంత్రి ఎర్రబెల్లి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకం కింద రాష్ట్రంలోని 23,968 ఆవాసాలకు నూటికి నూరు శాతం భూ ఉపరితల ఆరోగ్యవంతమైన మంచినీటిని అందిస్తున్నామన్నారు.

ఈప్రాజెక్టులో 19 ఇంటేక్‌వెల్స్, 50 నీటి శుద్ధి కేంద్రాలు, 1163 సర్వీస్ రిజర్వాయర్లు, 441 సంపులు, లక్షా 46వేల కి.మీ. పైపులైన్ల ద్వారా మౌలిక సదుపాయాలతో కూడిన మంచినీటిని అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో మంచినీటిని అందిస్తున్న రాష్ట్రం మరొకటి లేదన్నారు. గతంలో సిఎం కెసిఆర్ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సింగూరు నీటిని సిద్ధిపేటకు అందించిన ఈ స్కీంను మనం రాష్ట్రంలో విజయవంతంగా అమలుచేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ సలహాదారు జ్ఞానేశ్వర్, ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, సీఈలు విజయ్ ప్రకాశ్, మోహన్‌రెడ్డి, శ్రీనివాస్, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News