Monday, April 29, 2024

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సిఎంలతో అమిత్ షా భేటీ..

- Advertisement -
- Advertisement -

Amit Shah meeting with naxals based states CMs

న్యూఢిల్లీ: దేశంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఆదివారం ఉదయం నిర్వహించిన ఈ సమావేశంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదం ప్రస్తుత పరిస్థితి, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సిఎం కెసిఆర్, ఎపి హోంమంత్రి సుచరిత తోపాటు చత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, యూపీ, బెంగాల్ రాష్ట్రాల సిఎంలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా, వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల సంఖ్యను మూడేళ్ల క్రితం కేంద్రం ప్రభుత్వం 100 నుంచి 70కి తగ్గించింది. కేవలం 25 జిల్లాల్లో మాత్రమే మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్నట్టు వెల్లడించింది. 2014 నుంచి వామపక్ష తీవ్రవాద హింసాత్మక ఘటనలు 47% తగ్గాయని హోంశాఖ తెలిపింది.

Amit Shah meeting with naxals based states CMs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News