Tuesday, April 30, 2024

జిడిపిలో ఆంధ్రప్రదేశ్‌ది 4.6 శాతం వాటా: మంత్రి మేకపాటి

- Advertisement -
- Advertisement -

Andhra Pradesh 4.6 percent share in India GDP

అమరావతి: దేశ జిడిపిలో ఆంధ్రప్రదేశ్‌ది 4.6 శాతం వాటా మాత్రమేనని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఎపిలోని 13 జిల్లాల గుండా మూడు పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేయునున్నామన్నారు. ఎపికి 2019లో రూ.34,696 కోట్లు, 2020లో 9840 కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నంలో మూడు కాన్సెప్టు సిటీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పెట్టుబడులు ఆకర్షణకు మౌలిక సదుపాయాలు అవసరమన్నారు. గత రెండేళ్లలో 14 వేల ఎంఎస్‌ఎంఇలు స్థాపించామని, కడప జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్ కూడా రాబోతోందన్నారు. రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం పోర్టుల అభివృద్ధిపై దృష్టి పెడుతామన్నారు. రెండు దశల్లో 8 ఫిషింగ్ హార్చర్ల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News