Sunday, April 28, 2024

అనిల్ దేశ్‌ముఖ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

- Advertisement -
- Advertisement -

Anil Deshmukh
ముంబయి: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను మనీలాండరింగ్ నిరోధక చట్టం(పిఎంఎల్‌ఎ) కింద ప్రత్యేక కోర్టు సోమవారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఈ సీనియర్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పిఎంఎల్‌ఎలోని వివిధ సెక్షన్ల కింద నవంబర్ 1న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) అరెస్టు చేసింది. ఆయన రిమాండ్‌ను పొడగించాల్సిందిగా ఇడి కోరినప్పటికీ, దానిని తిరస్కరించి హాలీడే కోర్టు నవంబర్ 6న దేశ్‌ముఖ్(71)ను 14రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆయనపై మామూళ్ల వసూలు, మనీలాండరింగ్ ఆరోపణలను ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ చేశారు.దేశ్‌ముఖ్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని కూడా ఆరోపించారు. ముంబయిలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి రూ. 100 కోట్లు వసూలు చేయాల్సిందిగా ఆయన ప్రస్తుతం సస్పెండయిన పోలీస్ ఆఫీసర్ సచిన్ వాజేను కోరారని కూడా ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News