Friday, May 3, 2024

గణతంత్ర దినోత్సవం కానుకగా ‘హీరో’..

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనళ్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘హీరో’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అమర్ రాజా మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గల్లా పద్మావతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ మూవీని జనవరి 26న విడుదల చేస్తున్నట్టు ఫీల్మ్ మేకర్స్ ప్రకటించారు. ఈ సంధర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో అశోక్ గల్లా యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు, నరేష్, సత్య, అర్చన సౌందర్య తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Ashok Galla ‘Hero’ Movie to Release on Jan 26th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News