Tuesday, April 30, 2024

జంతువుల సంరక్షణ చట్టాలను పక్కాగా అమలు చేయాలి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : జంతు సంరక్షణ చట్టాలను పక్కాగా అమలు చేసి, జం తు సంక్షేమానికి అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జంతు సంరక్షణ సామాజిక బాధ్యతపై ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కు మార్ మాట్లాడుతూ మానవులతో పాటు జీవించే జంతువులను హింసించకుండా వాటి సంక్షేమానికి ప్రభుత్వం రూపొందించిన చట్టాలను కఠినంగా అమలు చేయాలన్నారు.

జంతువులపై దయ, కరుణతో ఉండేందుకు విద్యార్థుల్లో అవగాహన కల్పించాలన్నారు. ఇందుకోసం పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని డిఈఓను ఆదేశించారు. జంతువులను వాహనాల్లో రవాణా చేసేటప్పుడు గాయాలు కాకుండా జాగ్రత్తలు పాటించాలన్నా రు. వాహనాల్లో ఆరు జంతువుల కంటే ఎక్కువ ర వాణా చేయవద్దని, రవాణా అధికారి విధిగా తనిఖీ లు నిర్వహించాలన్నారు. ఆవులు, పశువులు, గేదెలను వధించుట నిషేధమన్నారు. పశువులు అక్ర మ రవాణాపై పోలీస్, రవాణా శాఖల అధికారులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు.

నాగర్‌కర్నూల్ నుంచి జంతు అక్రమ రవాణా జరగకుండా పటిష్టంగా దృష్టి పెట్టాలన్నారు. జంతువులు తరలి ంచే వాహనాలు, ఓవర్ లోడింగ్‌తో ఉన్నా జరిమానా విధించాలన్నారు. వయస్సు ముదిరిన జంతువులను తరలించేటప్పుడు సంబంధిత అధికారుల ను ంచి ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని కొట్ర, హాజీపూర్, తి మ్మాజిపేట ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి జంతు రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

పోలీస్, రవాణా, రెవెన్యూ, వెటర్నరీల సంబంధిత శాఖల అధికారులు చెక్‌పోస్టుల్లో సమన్వయంతో పనిచేసి అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. జంతువులను అక్రమంగా రవాణా చేస్తే వాహనాలు సీజ్ చేయాలన్నారు. రానున్న బక్రీద్ సందర్భంగా పట్టణాల్లో జంతువులను వధించిన వ్యర్థాలను రోడ్లపై పడేయకుండా వారికి కావాల్సిన కవర్లను అందజేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అటవిశాఖ అధికారి రోహిత్ గోపిడి, పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ పివి రమేష్, జిల్లా రవాణా శాఖ అధికారి ఎర్రిస్వామి, డిఈఓ గోవిందరాజులు, వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, మార్కెటింగ్ అధికారి నాగమణి, మున్సిపల్ కమిషనర్ జయంత్ కుమార్ రెడ్డి, డిఎస్పి మోహన్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News