Monday, May 6, 2024

ఠాణాకు క్యూ కడుడుతున్న ‘ఇన్నోహబ్ ’బాధితులు

- Advertisement -
- Advertisement -

Another 20 victim lodged complaint with Madhapur police against Inno hub

మరో 20మంది ఉద్యోగుల ఫిర్యాదు

మనతెలంగాణ/హైదరాబాద్ : ఇన్నోహబ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధ బాధితులు మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌కు క్యూ కడుతున్నారు. ఈక్రమంలో బ్యాక్‌డోర్ ఉద్యోగాల పేరుతో మోసపోయిన మరో 20 బాధితులు ఇన్నోహబ్‌పై మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 80 మందికి పైగా బాధితులు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారని, బాధితుల ఫిర్యాదులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. ఈ కేసులకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లో ఇన్నోహబ్ టెక్నాలజీ సంస్థకు చెందిన రాహుల్ అకోలేతో పాటు మరో మహిళ కమలేశ్ కుమారిని నిందితులుగా చేర్చామని, బాధితులు సంఖ్య భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోందని విచారణాధికారులు వివరిస్తున్నారు.

బాధితుల్లో పలు రాష్ట్రాల వారు 

ఇన్నోహబ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధ బాధితులలో తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన 2వేల మంది వరకు ఉన్నట్లు బాధితులు వివరిస్తున్నారు. ఇన్నోహబ్ టెక్నాలజీ ప్రతినిధులు ఆన్‌లైన్, బ్యాక్‌డోర్ ద్వారా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని సైతం రిక్రూట్ చేసుకున్నట్లు పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తేలింది. ఇప్పటి వరకూ సంస్థ ప్రతినిధుల ఆచూకీ తెలియరాలేదని, ఉద్యోగం పేరిట ఒక్కొక్కరి నుంచి రూ. 1.5 నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారని, ఆయా అంశాలపై విచారణ చేపడుతున్నామని పోలీసులు వివరిస్తున్నారు. కాగా ఇన్నోహబ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధ రెండు నెలల ట్రైనింగ్ ఇచ్చిందని, శిక్షణా కాలంలో కొందరికి వేతనాలు సైతం చెల్లించినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

పథకం ప్రకారం 

ఇన్నోహబ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధ ప్రతినిధులు పథకం ప్రకారం మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆన్‌లైన్‌లో నిరుద్యోగులను ఆకర్షించి వారి నుంచి ఉద్యోగాల పేరిట నగదు వసూళ్లకు పాల్పడినట్లు తేలింది. బాధితుల ఫిర్యాదు మేరకు అన్ని కోణాలలో దర్యాప్తు చేపడుతున్నామని, ఇన్నోహబ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధకు చెందిన 15 మంది ప్రతినిధుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇన్నోహబ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధ గత ఏడాది నుంచి ముందస్తు ప్రణాళిక ప్రకారం మోసానికి పాల్పడ్డారని, పథకంలో భాగంగా కంపెనీ మెయిల్స్, వ్యక్తిగత మెయిల్స్ బ్లాక్ చేశారని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News