Monday, April 29, 2024

వామ్మో.. చైనాలో కొత్త స్ట్రెయిన్

- Advertisement -
- Advertisement -

Another new type of strain coronavirus in China

బీజింగ్ : కరోనాకు పుట్టిల్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనాకు మరో కొత్త రకం స్ట్రెయిన్ కరోనా వైరస్ బయటపడడం శాస్త్రవేత్తలకు అంతుపట్టడం లేదు. 1.5 కోట్ల మంది నివసించే గాంజావ్ నగరంలో ఈ కొత్తరకం కేసులు దాదాపు 20 వరకు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై అనేక ప్రాంతాల్లో ఆంక్షలు విధించింది. ఈ నగరంలో వారం రోజుల్లోనే 20 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య చాలా స్వల్పమే అయినప్పటికీ కరోనా మహమ్మారిని కట్టడి చేశామని నిబ్బరం పడుతున్న అధికారుల్లో మళ్లీ ఇదో సమస్యగా ఎదురైంది. ఈ కొత్త వేరియంట్ మరింత ప్రమాదకరమని, చాలా ఉధృతంగా ఉందని చైనా అధికారులు వెల్లడించినట్టు గ్లోబల్‌టైమ్స్ వార్తా పత్రిక పేర్కొంది. కొత్త వేరియంట్ ఉనికిని గుర్తించడానికి లివాన్ జిల్లాలో శనివారం పరీక్షలకు ప్రభుత్వం ఆదేశించింది.

ఈ జిల్లాలో ఐదు ప్రాంతాల్లో ప్రజలకు పరీక్షలు నిర్వహిస్తారు. బహిరంగ మార్కెట్లు, శిశు సంరక్షణ కేంద్రాలు, సాంస్కృతిక కార్యకలాపాలు, రెస్టారెంట్లపై ప్రభుత్వం నిషేధం విధించింది. లివాన్‌కు చుట్టుపక్కల నాలుగు జిల్లాల్లో బహిరంగ కార్యక్రమాలను పరిమితం చేయాలని అధికారులను ఆదేశించింది. చైనాలో ప్రతిరోజూ కొన్ని కేసులు నమోదవుతున్నాయి. అయితే వారంతా విదేశాల నుంచి వస్తున్నవారే. కానీ ఇద్దరు స్థానికులతోపాటు, దేశం లోని మరికొన్ని ప్రాంతాల్లో మరో 14 మందికి కొత్తరకం వైరస్ సోకినట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిసన్ వెల్లడించింది.

కరోనా కొత్త హైబ్రిడ్

భారత్, బ్రిటన్ దేశాల్లో బయటపడిన కొత్తరకం కన్నా మరింత ప్రమాదకరమైన కొత్తహైబ్రిడ్ (సంకర జాతి కరోనా ) వేరియంట్‌ను వియత్నాం శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వియత్నాం లోని 63 నగరాల్లో 31 నగరాలు కరోనాతో అల్లాడుతున్నాయి. 6396 మంది కరోనా బాధితుల్లో 47 మంది మృతి చెందారు. వీరి నుంచి సేకరించిన నమూనాలను పరిశీలించి శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు. ఈ కొత్తరకం హైబ్రిడ్ వేరియంట్‌తో తమ దేశంలో అత్యధిక శాతం మంది ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారని వియత్నాం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ హైబ్రిడ్ వేరియంట్ సమాచారం త్వరలోనే ప్రపంచ ఆరోగ్యసంస్థకు తెలియచేస్తామని వియత్నాం ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే వియత్నాంలో ఏడు రకాల కరోనా వేరియంట్లను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటి వ్యాప్తిని అక్కడి ప్రభుత్వం కట్టడి చేయగలిగింది. కానీ హైబ్రిడ్ రకం మ్యూటెంట్‌ను కట్టడి చేయడం కష్టంగా మారింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News