Friday, April 26, 2024

బెల్లంకొండకు జోడీగా అను ఇమ్మాన్యుయెల్

- Advertisement -
- Advertisement -

 

‘రాక్షసుడు’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న సినిమాను సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్నారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి.సుబ్రమణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇప్పటికే ఒక హీరోయిన్‌గా నభా నటేష్ నటిస్తుండగా… తాజాగా మరో నాయికగా అను ఇమ్మాన్యుయెల్ ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్ షూటింగ్‌లో ఆమె చేరారు. నభా నటేష్, అను ఇమ్మాన్యుయెల్ చేస్తున్న పాత్రలు రెండిటికీ కథలో ప్రాధాన్యముంటుందని ఫిల్మ్‌మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరికొత్త లుక్‌లో కనపడబోతున్నారు. ఇందుకోసం ఆయన 8 ప్యాక్స్‌తో మేకోవర్ కావడం విశేషం.

Anu Emmanuel opposite to Bellamkonda Srinivas

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News