Monday, April 29, 2024

టీచర్ పోస్టులకు ఏ రాష్ట్రం వారైనా ఓకే : నితీశ్ కుమార్

- Advertisement -
- Advertisement -

పాట్నా : బీహార్ రాష్ట్రం లోని ప్రభుత్వ పాఠశాలల్లో భారీ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అర్హత కలిగిన ఏ రాష్ట్రం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చని బీహార్ ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం నితీశ్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో విద్యాశాఖ చేసిన ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్టు క్యాబినెట్ సెక్రటేరియట్ అదనపు చీఫ్ సెక్రటరీ ఎస్. సిద్దార్ఠ్ వెల్లడించారు.

క్యాబినెట్ భేటీ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త సర్వీస్ నిబంధనల ప్రకారం గతంలో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో బీహార్ వాసులను మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించుకునే వారు. అయితే తాజాగా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఉద్యోగ నియామకానికి నివాస ఆధారిత రిజర్వేషన్ ఏమీ ఉండదని సిద్ధార్ధ్ తెలిపారు. మంగళవారం క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంతో భారతీయ పౌరులు ఎవరైనా బీహార్ లోని 1.78 లక్షల ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News