Friday, May 3, 2024

ఎపి బడ్జెట్ @రూ.2.24లక్షల కోట్లు..

- Advertisement -
- Advertisement -

అమరావతిః ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మంగళవారం ఎపి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గన రూ.2.24,789.18 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఎపి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. 2018-19లో స్థూల ఉత్పత్తి 8 శాతమే పెరిగిందని, గత ప్రభుత్వం ఇస్తానుసారంగా ప్రజాధనాన్ని ఖర్చు చేసిందన్నారు. పేద ప్రజల కష్టాలను తీర్చడానికి నవరత్నాలు అమలు చేస్తున్నామని, లాక్‌డౌన్ నేపథ్యంలో కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా చూశామని ఆయన తెలిపారు.

బడ్జెట్ కేటాయింపు వివరాలు : 

బడ్జెట్ అంచనా వ్యయం         – రూ.2,24,789.19 కోట్లు
రెవెన్యూ వ్యయం అంచనా       – రూ.1,80,392.62 కోట్లు
మూలధన వ్యయం అంచనా    – రూ.44,396.54 కోట్లు
వ్యవసాయ రంగం               – రూ.11,891 కోట్లు
బీసిల సంక్షేమానికి              – రూ.23,406 కోట్లు
ఎస్టీల సంక్షేమానికి              – రూ.1804 కోట్లు
ఎస్సీల సంక్షేమానికి             – రూ.7,525 కోట్లు
రేషన్ బియ్యానికి                – రూ.3,000 కోట్లు
వైస్‌ఆర్ గృహ వసతికి           – రూ.3,000 కోట్లు
ఆరోగ్య శ్రీకి                       – రూ.2,100 కోట్లు
వైద్య రంగానికి                   – రూ.11,419 కోట్లు
బలహీన వర్గాల గృహనిర్మాణం   – రూ.150 కోట్లు
అభివృద్ధి పథకాలకు             – రూ.84,140.78 కోట్లు
మైనార్టీల అభ్యున్నతికి           – రూ.2050.22 కోట్లు
బీసిల అభివృద్ధికి                 – రూ.25,331.30 కోట్లు
షెడ్యూల్ తెగల సంక్షేమానికి      – రూ.15,735 కోట్లు
కాపుల సంక్షేమానికి              – రూ.2,847 కోట్లు
వైఎస్‌ఆర్ ఆసరా                  – రూ.6,300 కోట్లు
వైఎస్‌ఆర్ పెన్షన్ కానుక           – రూ.16,000 కోట్లు
అమ్మఒడి                         – రూ. 6,000 కోట్లు
విద్యారంగం                        – రూ.22,604.01కోట్లు
జగనన్న విద్యాదీవెన              – రూ.3,009 కోట్లు
జగనన్న వసతి దీవెన             – రూ.2,000 కోట్లు
వైఎస్‌ఆర్ చేయూత                – రూ.3,000 కోట్లు
వైఎస్‌ఆర్ కాపునేస్తం               – రూ.350 కోట్లు
వైఎస్‌ఆర వాహనమిత్ర             – రూ.275.51 కోట్లు
వైఎస్‌ఆర్ జగనన్న చేదోడు         – రూ.247.04 కోట్లు
వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం            – రూ.200 కోట్లు
వైఎస్‌ఆర్ మత్సకార భరోసా         – రూ.109.75 కోట్లు
వైఎస్‌ఆర్ రైతు భరోసా              -రూ.3,615.60 కోట్లు
జగనన్న తోడు                     – రూ.100 కోట్లు
ఇమామ్‌లు, మౌజాన్లకు           – రూ.50 కోట్లు
న్యాయ నేస్తం                       – రూ.12.75 కోట్లు
జెరూసలెం పవిత్రయాత్రకు          – రూ.5 కోట్లు
ధరల స్థిరీకరణ నిధికి               – రూ.3,000 కోట్లు
రైతులకు వడ్డీలేని రుణాలు         – రూ.1,100 కోట్లు
వైఎస్‌ఆర్-పిఎం ఫసల్ బీమా యోజన – రూ.500 కోట్లు
రాష్ట్రీయ కృషి వికాస యోజనకు     – రూ.237.23 కోట్లు
రైతులకు విత్తనాల పంపిణీ కోసం    – రూ.200 కోట్లు
నేషనల్ హార్టీకల్చర్ మిషన్          – రూ.150.99 కోట్లు
వైద్యరంగంలో నాడు నేడు కోసం     – రూ.1,528 కోట్లు
మెడికల్ కాలేజీల కోసం             – రూ.1,122.66 కోట్లు
గ్రామ వాలంటీర్ల కోసం               – రూ.1104 కోట్లు
గ్రామ సచివాలయాల కోసం          – రూ.1633 కోట్లు
డ్వాక్రా మహిళల వడ్డీలేని రుణాలకు – రూ.975.19 కోట్లు
కొత్త రాజధాని మౌలిక వసతుల కోసం- రూ.500 కోట్లు

AP Minister Buggana Speech State Budget 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News