Saturday, May 4, 2024

ప్రభుత్వ నిబంధనల ప్రకారం గురుకుల ఉపాధ్యాయుల నియామకాలు

- Advertisement -
- Advertisement -

పకడ్బందీగా సర్టిఫికెట్స్ పరిశీలన, అర్హులైన వారికే ఉద్యోగాలు: ట్రిబ్ అధికారులు

మన తెలంగాణ/ హైదరాబాద్: గురుకుల ఉపాధ్యాయుల నియామకాలలో ఎలాంటి గందరగోళం జరగలేదని ప్రభుత్వ నిబంధనల మేరకే నియామకాలు చేపట్టామని ట్రిబ్ అధికారులు పేర్కొన్నారు. ‘పరేషానులో గురుకుల అభ్యర్థులు’ అంటూ ఓ దినపత్రికలో వచ్చిన వార్త కథనంలో ఎలాంటి వాస్తవాలు లేవన్నారు. పారదర్శకంగా నిర్వహించిన పరీక్ష విధానంలో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా చాలా పకడ్బందీగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. 2018 లో గత ప్రభుత్వం relinquishment పద్ధతిని తొలగించారని, సుప్రీం కోర్టు ఆదేశాలమేరకు వెయిటింగ్ రెండవ జాబితా పద్ధతిని 1998 లోనే రద్దు చేశారని తెలిపారు. నిజానిజాలు తెలియకుండా అభ్యర్థులను గందరగోళంలోకి నెట్టవద్దని, అభ్యర్థులు కూడా అవాస్తవాలను నమ్మవద్దని అధికారులు వివరించారు.

గత ఏడాది 9210 పోస్టులకు 9 నోటిఫికేషన్లు ఇచ్చామని ఆగస్టులో అన్ని పోస్టులకు సిబిటి విధానంలో పరీక్షలు నిర్వహించి, ఫలితాలు పారదర్శకంగా ప్రకటించామని అధికారులు వివరణ ఇచ్చారు. కోర్టు కేసులను పరిష్కరించి ఫలితాలు ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఫలితాలను ప్రకటించి చిత్తశుద్ధిని నిరూపించుకున్నామన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న తరుణంలో త్వరగా నియామకాలు చేపట్టాలన్న ఆలోచనతో 200 మంది సిబ్బందితో రాత్రింబవళ్ళు చాలా పకడ్బందీగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ ను నిర్వహించామని ట్రిబ్ అధికారులు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. వికలాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి అనువైన తేదీల్లోనే మెడికల్ వెరిఫికేషన్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఏ ఒక్క పోస్టు కూడా అనర్హులకు ఇవ్వకూడదనే దృఢ సంకల్పంతోనే పని చేస్తున్నామని ట్రిబ్ అధికారులు స్పష్టం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News