Monday, April 29, 2024

ఖబ్లాన్ అడవుల్లో ఆర్మీ భారీ కూంబింగ్ ఆపరేషన్

- Advertisement -
- Advertisement -

Army heavy combing operation in Khablan forests

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ రాజౌరి జిల్లా ఖబ్లాన్ అడవుల్లో భారీ ఎత్తున సాయుధులైన ఉగ్రవాదులు ఉన్నారని గ్రామస్థులు అందించిన సమాచారంపై ఆర్మీ పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్‌ను ప్రారంభించింది. ముందు జాగ్రత్త చర్యగా థన్‌మండి రాజౌరి రోడ్డుపై రాకపోకలను నిలిపి వేశారు. జమ్ముకశ్మీర్ లోని పూంచ్,పిర్‌పంజల్ లో కొనసాగుతున్న ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌లో భాగంగా ఈ కూంబింగ్ ఆపరేషన్ జరుగుతోంది. అక్టోబర్ 11న సురన్‌కోటే అడవుల్లో ప్రారంభమైన కూంబింగ్ ఆపరేషన్‌లో గత 27 రోజుల్లో ఇద్దరు సైన్యాధికారులతోసహా తొమ్మిది మంది సైనికులు, ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆపరేషన్ మెంధార్ వరకు విస్తరించారు. తొమ్మిది మంది సైనికులను బలిగొన్న ఉగ్రవాదుల గ్రూపుకు చెందిన వారే ఇప్పుడు ఖబ్లాన్ అడవుల్లో ఉన్నట్టు భావిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News