Friday, May 3, 2024

ఇంజనీర్లను బురిడీ కొట్టించిన ఘనులు

- Advertisement -
- Advertisement -

Arrest of four youths for extorting Money

 

నలుగురు నిందితుల అరెస్టు
2,500 మంది నుంచి రూ.7 కోట్లు వసూలు చేసిన నిందితులు
రూ.58 లక్షలు,387 గజాల ప్లాట్ పత్రాలు స్వాధీనం
వివరాలు వెల్లడించిన సైబరాబాద్ సిపి విసి సజ్జనార్

మనతెలంగాణ, హైదరాబాద్ : అధిక వడ్డీ ఆశచూపి పలువురి వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేసిన నలుగురు యువకులను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.58లక్షల నగదు, ల్యాప్‌టాప్, 387 గజాల ప్లాట్‌కు సంబంధించిన పత్రాలు, నాలుగు మొబైల్ ఫోన్లు, రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎపిలోని నర్సింపట్నంకు చెందిన నందకిషోర్, విశాఖపట్టణంకు చెందిన చిట్టం రెడ్డి ఆనంద్, భూమిరెడ్డి అవినాష్, తులూరి శ్రీనివాస్ కలిసి stemcormax hedge జులై, 2020లో ఈకంపెనీని ప్రారంభించారు. దానికి అనుగుణంగా వెబ్‌సైట్, యాప్‌ను డెవలప్ చేసి ప్రకటనలు ఇచ్చారు. తమది విదేశీ కంపెనీగా భావించాలని చెప్పి పేరు విదేశీ కంపెనీ వలే పెట్టారు, నంబర్లను కూడా యూకేకు సంబంధించిన +441474770338,+13222522443 ఇచ్చారు. తమ కంపెనీలో డబ్బులు డిపాజిట్ చేసిన వారికి మొదట 60 రోజులు రోజుకు 5 శాతం వడ్డీ ఇస్తామని, ఇందులో చేరిన వారు మరొకరిని చేర్పిస్తే 10 శాతం ఇస్తామని ఆశచూపారు.

ఇందులో రూ.10వేలు, 25,000, 50,000, 75,000, 1,00,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చని ప్రకటన ఇచ్చారు. నిందితులు ఎక్కడా ఆఫీసు తీసుకోకుండా కేవలం ల్యాప్‌టాప్‌ల ద్వారానే పనిని చక్కబెట్టారు. నిందితుల్లో ఒకరైన భూమిరెడ్డి అవినాష్ కంప్యూటర్ సైన్స్‌లో డిప్లమా చేయడంతో వెబ్‌సైట్, యాప్‌ను డిజైన్ చేశాడు. లక్ష రూపాయలు పెట్టిన వారికి రోజుకు రూ.5,000 చొప్పున 60 రోజుల్లో రూ.3లక్షలు ఇస్తామని చెప్పడంతో చాలామంది చేరారు. దీంతో నగరంలో పనిచేస్తున్న పలువురు ఇంజనీర్లు ఇందులో పెట్టుబడి పెట్టారు. ఇరు రాష్ట్రల్లో ఉన్న ఎఈలు తమ వాట్సాప్ గ్రూపు ద్వారా ఇందులో డబ్బులు పెడితే ఎక్కువగా వడ్డీ ఇస్తున్నారని సమాచారం ఇవ్వడంతో చాలామంది డబ్బులు పెట్టారు. దాదాపు 2,500 మంది వద్ద నుంచి రూ.7కోట్లు వసూలు చేశారు. ఇందులో డబ్బులు పెట్టేందుకు చాలా మంది వస్తుండడంతో నిందితులు వెంటనే సెప్టెంబర్‌లో మూసివేశారు.

ఈ క్రమంలోనే మణికొండకు చెందిన వ్యక్తి టిఎస్‌ఎస్‌పిడిసిఎల్‌లో ఎఈగా పనిచేస్తున్నాడు. ప్రకటనను చూసి ఫోన్ చేయగా నిందితులు వివరాలు చెప్పారు. వారి మాటలు నమ్మి రూ.1,60,000 పెట్టుబడి పెట్టారు. ముందుగా రూ.15,000 వడ్డీ ఇచ్చిన నిందితులు తర్వాత ఇవ్వడం మానివేశారు. అనుమానం వచ్చిన బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్రైం డిసిపి రోహిణి ప్రియదర్శిని, సైబర్ క్రైం ఎసిపి బాలకృష్ణారెడ్డి పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ సంజయ్‌కుమార్ తదితరులు కేసు దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News