Sunday, May 12, 2024

రాష్ట్ర వచ్చాకే…అన్ని రంగాల్లో అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సమూలమైన మార్పులు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంతో నగరాలు పట్టణాలు అన్ని విధాల అభివృద్ధిని సంతరించుకున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌ రసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ పట్టణంలోని పద్మనాయక కళ్యాణమండ పం లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక రాష్ట్రంలో సమూల మార్పులు సంభవించాయన్నారు. గడిచిన 9 సం వత్సరాలుగా జరిగిన అభివృద్ధిని భాహ్య ప్రపంచానికి తెలిపాలనే సీఎం కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. తెలం గాణ వ్యాప్తంగా సర్వ మతాలు జరుపుకుంటున్న పండుగ దశాబ్ది ఉత్సవాల పండుగ అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకా లతో దేశంలో తెలంగాణ ఐకాన్ గా నిలించందని అన్నారు.

పట్టణ ప్రాంతాల్లో మౌలికోసతల పెరుగుదల, మెరుగైన పారిశుద్ధ్యం, పచ్చద నం పెరుగుదలే మొదలుపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం అద్భుత ఫలితాలను ఇస్తుందని ప్రజలకు మెరుగైన సేవలు పట్టణ అభివృద్ధి తో మున్సిపాలిలకు మహర్దశ వచ్చిందన్నారు. సమైక్య పాలనలో కరీంనగర్ అభివృద్ధి అస్తవ్యస్తంగా ఉండేదని, పక్కనే మానేరు జలా శయం ఉన్నా, తాగునీటి కోసం ట్యాంకర్ల వద్ద నీటి కోసం అవస్థలు పడేవారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం సాధించు కున్నాక స్వయం పాలనలో కరీంనగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామన్నారు. అద్భుతంగా రోడ్లను నిర్మించామని, ప్రతిరోజూ తాగునీటిని సరఫరా చేస్తు న్నామన్నారు. కరీంనగర్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ 350 కోట్ల రూపాయల సిఎం అస్యురెన్స్ నిధు లు విడుదల చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ వరంగల్ నగరాలకు స్మార్ట్ సిటీ ఇస్తే హైదరాబాద్ ను కాదని కరీంనగర్ కి ఇవ్వాలని సీఎం కేసీఆర్ చొరవ తీ సుకున్నారని తెలిపారు.

కరీంనగర్లో జరుగుతున్న అభివృద్ధి పనులతో నగరం హైదరాబాద్ తర్వాత రెండవ గొప్ప నగరం గా అవతరించి ందన్నారు. స్వయం పాలనలో కరీంనగరంలో బ్రహ్మోత్సవాలు, కళోత్సవాలు,చిత్రోత్సవాలకు వేదికగా మారిందన్నారు. కేబుల్ బ్రిడ్జి, మా న్ రివర్ ఫ్రంట్, మెడికల్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, బ్రహ్మోత్సవాల నిర్వహణ, కాలేశ్వరం జలాలతో అభివృద్ధి సా ధించిందన్నారు. కరీంనగర్ అభివృద్ధి కోసం సంపూర్ణంగా సహకరించిన కార్పొరేటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

సిఎం కెసిఆర్ పథకాలు గడపగడపకు తీసుకెళ్లాలి : వినోద్ కుమార్
సిఎం కెసిఆర్ చేపడుతున్న అభివృద్ధిని గడపగడపకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్పొరేటర్ల పై ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. స్వతహాగా మంత్రి గంగుల కమలాకర్ సివిల్ ఇంజనీర్ కావడం కరీంనగర్ అభి వృద్ధిలో ప్రముఖ పాత్రను పోషిస్తుందన్నారు. కరీంనగర్ అభివృద్ధికి కారణం సిఎం కెసిఆర్ అని కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కరీం నగర్ కు రైల్వే లైన్ కావాలని సోనియా గాంధీని, మన్మోహన్ సింగ్ ను అడిగారన్నారు. కెసిఆర్ సిఎం అయిన తర్వాత తొలి జీవోను కరీంన గర్ అభివృద్ధి కోసం వందకోట్లతో విడుదల చేశారన్నారు. ఇప్పుడు మన నిధులతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, క రీంనగర్ స్మార్ట్ సిటీ కోసం ఇండోర్ వెళ్లి అధ్యయనం చేశామని,ఇప్పుడు ఇండోర్ కన్నా గొప్ప గా కరీంనగర్ ను తీర్చి దిద్దుతున్నామని తెలిపారు. కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ కోసం అహ్మదాబాద్ వెళ్లి సబర్మతి రివర్ ఫ్రంట్ ను పరిశీలించామని, కరీంనగరాన్ని లండన్ గా తీర్చిదిద్దుతా మంటే కొంతమంది రాజకీ య ప్రత్యర్థులు విమర్శలు చేశారని, అభివృద్ధి అనేది రాత్రికి రాత్రే జరగదని జరుగుతున్న అభివృద్ధి కేబుల్ బ్రిడ్జ్, మానేరు రివర్ ఫ్రంట్ మీ కళ్ళ కు కనిపించడం లేదా అన్నారు. కరీంనగర్‌కు మెడికల్ కాలేజ్ తీసుకువచ్చాం ఈ సంవత్సరం నుండె తరగతులను ప్రారంభిస్తామని తెలిపారు. సిఎం కెసిఆర్ చొరవ తీసుకొని కరీంనగర్ కు మెడికల్ వచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లకు షీల్ లను బహుకరించారు. ఉత్తమ సేవలు అందించిన పారిశుద్ధ్య కార్మికులకు ప్రశంసా పత్రాలు, సఫాయి కార్మికులకు సబ్బులు, చెప్పులు ఆయిల్ ప్యాకెట్లు, కొబ్బరి నూనె ప్యాకెట్లు వస్తువుల కిట్ ను పంపిణీ చేశారు. అంత కు ముందు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాహనాల ర్యాలీని అంబేద్కర్ స్టేడియం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విఫ్ పాడి కౌశిక్‌రెడ్డి, నగర మేయర్ వై సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ , అదనపు కలెక్టర్ గరీమ అగర్వా ల్, సుడా చైర్మన్ జీవి రామకృష్ణా రావు, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్,డిప్యూటీ కమిషనర్ త్రియంబకేశ్వరరావు, ఎస్‌ఈ నాగమ ల్లేశ్వరరావు, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News