Tuesday, May 14, 2024

ఏడాదికి నెలకన్నా తక్కువ సమావేశమైన అసెంబ్లీలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, చత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల్లో ని అసెంబ్లీలు ఏవి కూడా ఏడాదిలో కనీసం నెల రోజులు కూడా సమావేశం కాలేదు. పైగా ఏడాది కేడాది సమావేశాల రోజులు తగ్గిపోతూ వస్తున్నాయి. రాజస్థాన్ అసెంబ్లీ సగటున ఏడాదిలో 29 రోజులు సమావేశం కాగా, తెలంగాణ అసెంబ్లీ కేవలం 15 రోజలే సమావేశం అయిందని పిఆర్‌ఎస్ లెజిస్లేటివ్ రిసెర్చ్ అనే సంస్థ విడుదల చేసిన నివేదికనుబట్టి తెలుస్తోంది. 2019నుంచి 2023 మధ్యకాలంలో చతీస్‌గఢ్ అసెంబ్లీ సగటున ఏడాదికి 23 రోజులు సమావేశం కాగా, సమావేశం సమయం రోజుకు 5గంటలుగా ఉంది. ఇక మధ్యప్రదేశ్ అసెంబ్లీ సగటున ఏడాదికి 16 రోజులు మాత్రమే సమావేశం కాగా, సమావేశం సమయం రోజులు ఐదు గంటలుగా ఉంది.

మిజోరాం అసెంబ్లీ ఏడాదికి 16 రోజులు సమావేశమయితే సమావేశం సమయం రోజుకు సగటున ఐదు గంటలుగా ఉంది. ఎన్నికలు జరగనున్నీ ఐదు రాష్ట్రాల్లో రాజస్థాన్ అసెంబ్లీ ఏడాదికి సగటున 29 రోజులు సమావేశం కాగా, సమావేశం సమయం రోజుకు సగటున ఏడు గంటలుగా ఉందని ఆ నివేదిక వెల్లడించింది. కాగా ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన దీర్ఘకాలి డేటా అందుబాటులో ఉంది. కాగా గత పదేళ్లుగా ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాల రోజులు తగ్గుతూ వస్తుండడం గమనార్హం. తొలి పదేళ్లలో రాజస్థాన్ అసెంబ్లీ ఏడాదికి సగటున 59 రోజులు సమావేశమయితే మధ్యప్రదేశ్ అసెంబ్లీ48 రోజలు పాటు సమావేశమయింది. అయితే ఆ తర్వాతి పదేళ్లలో ఇది రాజస్థాన్‌లో 29 రోజులకు, మధ్యప్రదేశ్‌లో 21 రోజులకు తగ్గిపోయింది. కాగా తెలంగాణ 2017లో అత్యధికంగా 37 సమావేశం అయింది. అయితే ఆ తర్వాత ప్రతి ఏడాది 20 రోజులకన్నా తక్కువగా సమావేశాలు జరగడం గమనార్హం.

అంతేకాదు, ఈ రాష్ట్ర అసెంబ్లీలలో ప్రవేశపెట్టిన బిల్లుల్లో 48 శాతం బిల్లులు అదే రోజో లేదా, ప్రవేశపెట్టిన ఒక రోజులోనో ఆమోదం పొందాయి. మిజోరాం అసెంబ్లీ ప్రస్తుత టర్మ్‌లో 57 బిల్లులను ఆమోదించగా, అవన్నీ అదే రోజో లేదా ప్రవేశపెట్టిన ఒక రోజు తర్వాతో ఆమోదం పొందాయి. మిగతా అసెంబ్లీల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అంతేకాదు, ఈ రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఆర్డినెన్స్‌లు జారీ చేయడం జరిగింది. వాదనలు వినిపించగా, నిందితుల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News