Monday, April 29, 2024

జపాన్‌లో కొండ చరియలు విరిగిపడి 19 మంది గల్లంతు

- Advertisement -
- Advertisement -

At least 19 people killed in landslide in Japan

 

టోక్యో: జపాన్ రాజధాని టోక్యో పశ్చిమాన ఉన్న అటామి పట్టణంలో శనివారం భారీ వర్షాలకు అనేక ఇళ్లపై కొండ చరియలు విరిగిపడడంతో 19 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా పక్కనే ఉన్న కొండపైనుంచి మట్టి పెళ్లలు విరిగిపడడంతో దాదాపు 80 ఇళ్లు ధ్వంసమయ్యాయని అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సంస్థ అధికారి ఒకరు తెలిపారు. మట్టి పెళ్లల కింద వంద మందికి పైగా చిక్కుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నట్లు ఆయన చెప్పారు. అయితే శిథిలాలను తొలగించే సహాయ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. గత సోమవారం నుంచి జపాన్‌లోని అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అధిక శాతం పర్వతాలు, లోయలతో ఉండే జపాన్‌లోని చాలా పట్టణాలు కొండ చరియల ముప్పును ఎదుర్కొంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News