Tuesday, May 14, 2024

2023లో 21 శాతం తగ్గిన వాహన ఎగుమతులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గత ఏడాది వాహన ఎగుమతులు 21 శాతం తగ్గినట్లు ‘ వాహన తయారీదార్ల సమాఖ్య( ఎస్‌ఐఎఎం) వెల్లడించింది. విదేశీ మార్కెట్లలో ఆర్థిక, భౌగోళిక రాజకీయ సంక్షోభాలు కొనసాగుతుండడమే దీనికి కారణమని పేర్కొంది. 2022లో 52,04,966 యూనిట్ల వాహనాలు ఎగుమతి కాగా,గత ఏడాది అవి 42,85,809 యూనిట్లకు పరిమితమయ్యాయని తెలిపింది. కాగా ప్రయాణ వాహనాలు 6,44,842 యూనిట్లనుంచి 5 శాతం పెరిగి 6,77, 956కు చేరాయి.అయితే ద్విచక్ర వాహన ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 20 శాతం తగ్గి32,43,673 యూనిట్లకు పడిపోయాయి.ఇక 2022లో 88,305 యూనిట్ల వాణిజ్య వాహనాలు విదేశాలకు ఎగుమతి కాగా,ఆ సంఖ్య 2023లో 68,473కు పడిపోయింది.మరో వైపు త్రీవీలర్ వాహనాలు 30 శాతం తగ్గి 4,7,178 యూనిట్లనుంచి 2,91, 919 యూనిట్లకు చేరాయి.

2023 లో కొత్త మోడళ్ల విడుదల, దక్షిణాఫ్రికా, గల్ఫ్‌ప్రాంతంలో డిమాండ్ పుంజుకోవడం వంటి కారణాలు ప్రయాణికుల వాహనాల్లో ఎగుమతులు పెరగడానికి దోహదపడ్డాయని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మేనన్‌తెలిపారు.సరఫరా చెయిన్‌లో నెలకొన్న ఇబ్బందులు తొలగిపోవడం కూడా పెరుగుదలకు ఊతమిచ్చినట్లు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌డిసెంబర్ మధ్య మారుతీ సుజుకి అత్యధికంగా 2,02,786 యూనిట్లను ఎగుమతి చేసినట్లు వెల్లడించారు. అదే సమయంలో కియా ఇండియా ఎగుమతులు 33,872 యూనిట్లనుంచి 47,792 యూనిట్లకు పెరిగాయి. నిస్సాన్ 31,678 యూనిట్ల, హోండా కార్స్ 20, 262 యూనిట్లు ఎగుమతి చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News