Tuesday, May 14, 2024

జలమండలి ఉద్యోగులకు హెల్త్ కార్డులపై అవగాహన

- Advertisement -
- Advertisement -

Awareness on health cards for water board employees

హైదరాబాద్: జలమండలి ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డుల ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య భరోసా ఉంటుందని జలమండలి పర్సనల్ డైరెక్టర్ శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. శనివారం ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులకు హెల్త్ కార్డులపైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా అదైర్యపడకుండా, హెల్త్ కార్డులు వినియోగించుకోవాలని సూచించారు. హెల్త్‌కార్డులకు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉన్నా, సహాయం కావాలన్నా హెల్త్‌కార్డుల హెల్ప్ డెస్క్‌ను సంప్రదించాలని చెప్పారు. ఈసందర్భంగా ఉద్యోగులకు యశోధ ఆసుపత్రి సౌజన్యంతో వైద్య శిభిరం నిర్వహించారు. ఉద్యోగులకు అన్ని రకాల వైద్య పరీక్షలు జరిపారు. ఈకార్యక్రమంలో జలమండలి సీజీఎం ఎంఏ ఖాదర్, మెడికల్ ఆఫీసర్ హిమబిందు, వాటర్ వర్క్ ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ అసోసియేట్ ప్రెసిడెంట్లు రాజిరెడ్డి, జహంగీర్, జనరల్ సెక్రటరీ జయరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News