Saturday, April 27, 2024

రియల్ అయోధ్యానగరి

- Advertisement -
- Advertisement -
Ayodhya land prices double in a month
రాముడితో భూముల ధరలకు రెక్కలు

అయోధ్య : రామాలయం రూపుదిద్దుకుంటున్న యుపిలోని అయోధ్యలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు పలు ఆకర్షణీయ ఆఫర్లతో అందరినీ ఆకట్టుకొంటోంది. స్థిరాస్తుల ధరలు విస్తరించుకుని ఉన్న కరోనా మహమ్మారితో తలెత్తిన మాంద్యాన్ని కూడా తోసిరాజంటూ పెరుగుతూ పోతున్నాయి. ఇక్కడ రామాలయ నిర్మాణానికి ప్రధాని మోడీ భూమి పూజ చేసి నెలరోజులే అయింది. ఈ లోపునే ధరలు రెండింతలు అయ్యాయి. అయోధ్యను వాటికన్ నగరంలాగా సకల సౌకర్యాలతో తీర్చిదిద్దుతామని, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఉండేందుకు తగు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించారు. దీనితో పట్టణంలో ఇప్పటికే పలు భూములు ఉన్న వారు వీటిని వాణిజ్యపరంగా మార్చుకునేందుకు సకల సన్నాహాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.

అయోధ్య ఒక్కటే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా భూముల ధరలు పెరిగాయి. ఇటీవలి కాలంలోనే చదరపు అడుగుకు రూ వేయి నుంచి 1500 వరకూ ధరలు పట్టణం మధ్యలో పెరిగాయి. ప్రస్తుతం రేట్లు ఇక్కడ చదరపు అడుగులకు రెండువేల నుంచి మూడు వేల వరకూ ఉంది. ఇది మరింత పెరుగుతుందని ప్రాపర్టీ కన్సల్టెంట్ రిషి టాండన్ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు తరువాతి దశ నుంచి ఇక్కడ రియల్ ఎస్టేట్ పూర్తిగా పుంజుకుంటూ వస్తోందని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండే హోటల్స్, టూరిస్టు రవాణా సంస్థలు ఇప్పుడు అయోధ్యలో నెలకొనేందుకు రంగం సిద్ధం అయింది. రామాలయానికి అనుసంధానంగా పలు భారీ స్థాయి కట్టడాలు, ప్రామాణిక ఏర్పాట్లు ఉంటాయని అధికారులు తెలిపారు.

దీనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు సంబంధిత నిర్మాణాలకు అవసరం అయిన భూమి సేకరించుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతోంది. అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయం, పలు 3స్టార్ హోటల్స్ ఏర్పాటు అవుతాయని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తెలిపారు. అయోధ్యను యాత్రానగరిగా ఇండియా వాటికన్ సిటీగా మారుస్తామని కూడా తెలిపారు. దీనితో ఇప్పటివరకూ మట్టిరోడ్లు ఇతరత్రా అవలక్షణాలతో ఉండే ఈ సరయూ తీరపు పట్టణం అందుకు అనుగుణంగా సరికొత్త హంగులు సంతరించుకునేందుకు సిద్ధం అయింది. రామాలయం పూర్తి స్థాయి నిర్మాణం నాటికి ఇది సకల కళాశోభిత అయోధ్యనగరి అవుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో అయోధ్య పూర్తిగా కొత్త కళను సంతరించుకుంటుంది. ఇక్కడ స్థలాలు ఉన్న వారు విశేష స్థల ప్రాశస్థాన్ని బట్టి తగు విధంగా ప్రతిఫలం పొందేందుకు రంగం సిద్ధం అయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News