Friday, May 3, 2024

‘డేగల బాబ్జీ’గా…

- Advertisement -
- Advertisement -

నిర్మాత బండ్ల గణేష్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రానికి ‘డేగల బాబ్జీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటో ంది. ఈ టైటిల్ పోస్టర్‌ను బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేశారు. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ… రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. ఈనెల ప్రారంభంలో ఈ సిని మా చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శక – ని ర్మాతలు మాట్లాడుతూ “తమిళ హిట్ మూవీ ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’కి రీమేక్ ఇది. తమిళంలో ఆర్. పార్తిబన్ పోషించిన పాత్రను తెలుగులో బండ్ల చేస్తున్నారు. ఈ హీరో పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు”అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News