Friday, May 10, 2024

శివమెత్తిన పడిక్కల్

- Advertisement -
- Advertisement -

Bangalore wins against Rajasthan

కోహ్లి మెరుపులు, సిరాజ్ మ్యాజిక్
రాజస్థాన్‌పై బెంగళూరు జయకేతనం

ముంబై: ఐపిఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయపరంపర కొనసాగుతోంది. గురువారం జరిగిన మ్యాచ్ లో బెంగళూరు పది వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. ఈ సీజన్‌లో చాలెంజర్స్‌కు ఇది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన బెంగళూరు 16.3 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే 181 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు దేవ్‌దుత్ పడిక్కల్, విరాట్ కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగి పోవడంతో బెంగళూరు ఘన విజయం అందుకుంది. చారిత్రక ఇన్నింగ్స్‌తో కదం తొక్కిన యువ సంచలనం దేవ్‌దుత్ పడిక్కల్ 52 బంతుల్లోనే 11 ఫోర్లు, మరో ఆరు భారీ సిక్సర్లతో అజేయంగా 101 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఐపిఎల్‌లో అత్యంత చిన్న వయసులో శతకం సాధించిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లి 47 బంతుల్లోఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 72 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. ఇద్దరి వీరవిహారంతో బెంగళూరు వరుసగా నాలుగో విజయాన్ని సాధించి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.

ఆరంభంలోనే..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ జోస్ బట్లర్ 8 పరుగులు మాత్రమే చేసి సిరాజ్ వేసిన అద్భుత బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రెండు ఫోర్లు కొట్టి దూకుడు మీద కనిపించిన బట్లర్ ఎక్కువ సేపు క్రీజులో నిలువడంలో విఫలమయ్యాడు. సిరాజ్ వేసిన బంతిని అంచన వేయడంలోవిఫలమై పెవిలియన్ చేరాడు. ఇక మరో ఓపెనర్ మన్నా న్ వోహ్రా తన పేలవమైన ఫామ్‌ను ఈసారి కూడా కొనసాగించాడు. కేవలం 7 పరుగులు మాత్రమే చేసి జేమీసన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరా డు. సిరాజ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికి పోయాడు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ సంజు శాంస న్ కూడా నిరాశే మిగిల్చాడు. రెండు ఫోర్లు, సిక్స్‌తో 21 పరుగులు చేసి జోరు మీద కనిపించిన సంజును వాషింగ్టన్ సుందర్ పెవిలియన్ దారి చూపించాడు. దీంతో రాజస్థాన్ 43పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది.

ఆదుకున్న దూబె

ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుటు పరిచే బాధ్యతను శివమ్ దూబె తనపై వేసుకున్నాడు. అతనికి యువ ఆటగాడు రియాన్ పరాగ్ అండగా నిలిచాడు. ఇద్దరు బెంగళరు బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను ఫోర్లుగా మలుస్తూ స్కోరును పరిగెత్తించారు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన పరాగ్4 ఫోర్లతో 25 పరుగులు చేసి ఔటయ్యాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News