ఆసియాకప్ సూపర్ 4 మ్యాచ్‌లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ఇరు జట్లు ఇప్పటివరకూ సూపర్ 4లో ఒక మ్యాచ్‌లో విజయం సాధించి.. ఒక మ్యాచ్‌లో ఓడిపోయాయి. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో భారత్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం బంగ్లాదేశ్ (Bangladesh) తమ జట్టులో మూడు మార్పులు చేసింది. సైఫుద్దిన్, నాసుమ్, తమిమ్ల స్థానంలో టస్కిన్, షేక్ మహెది జట్టులోకి వచ్చారు. ఇక పాకిస్థాన్ అదే జట్టుతో బరిలోకి దిగుతోంది.
తుది జట్లు:
పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(కెప్టెన్), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్(కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.
బంగ్లాదేశ్: సైఫ్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, జాకర్ అలీ(కెప్టెన్/కీపర్), నూరుల్ హసన్, మహేదీ హసన్, రిషాద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ రెహమాన్