Saturday, May 4, 2024

వ్యభిచారం చేస్తున్న బంగ్లాదేశియురాలి అరెస్టు

- Advertisement -
- Advertisement -

వ్యభిచారం చేస్తున్న బంగ్లాదేశియురాలి అరెస్టు
గడువు ముగిసినా ఇండియాలో తిష్ట
అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు

మనతెలంగాణ/హైదరాబాద్: వ్యభిచారం చేస్తున్న బంగ్లాదేశీయురాలిని రాచకొండ సరూర్‌నగర్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. బ్యూటీషియన్‌గా ఇండియాకు వచ్చిన నిందితురాలు వీసా గడువు ముగిసినా కూడా ఇక్కడే ఉంటోంది. పోలీసుల కథనం ప్రకారం…బంగ్లాదేశ్, నారాయోంగోంజ్ జిల్లా, మూసాపూర్ యూనియన్, బారాపార గ్రామానికి చెందిన మోయినా అక్తర్ అలియాస్ మున్ని సేన్ బ్యూటీషియన్ వీసాపై ఇండియాకు వచ్చింది. కొద్ది రోజులు పశ్చిమ బెంగాల్‌లో ఉన్న మోయినా అక్తర్ తర్వాత నగరంలోని పంజాగుట్ట,నాగార్జున సర్కిల్ వద్ద ఉంటోంది. నిందితురాలు 15 ఏళ్ల క్రితం ఇండియాకు వచ్చింది. ఇక్కడ బ్యూటిపార్లర్‌లో పనిచేస్తోంది. అక్కడ పరిచయం అయిన ఆంజనేయులు అనే వ్యక్తిని ప్రేమవివాహం చేసుకుంది. ఇద్దరు కలిసి బోడుప్పల్‌లో ఉన్నారు. అక్రమంగా నివాసం ఉండడంతో పోలీసులు అరెస్టు చేశారు.

2014లో బంగ్లాదేశ్‌కు వెళ్లింది, తిరిగి మరో వీసాపై ఇండియాకు వచ్చింది. ఇక్కడ రోడ్డు ప్రమాదం జరగడంతో ఆరు నెలలు ఇంట్లోనే ఉంది. ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో వ్యభిచారం చేయడంతో ఐదు సార్లు వనస్థలిపురం, ఎల్‌బి నగర్, ఉప్పల్, సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. తజాగా వ్యభిచారం చేస్తూ పట్టుబడడంతో పోలీసులు అరెస్టు చేశారు. మొదలు తను బంగ్లాదేశానికి చెందిన మహిళగా చెప్పలేదు. పోలీసులు విచారణ చేయడంతో మొత్తం విషయం బయటపడింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సరూర్‌నగర్ పోలీసులు తెలిపారు.

Bangladeshi woman arrested for prostitution in Hyd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News