Home తాజా వార్తలు తెలంగాణకు బేస్‌బాల్ టైటిల్

తెలంగాణకు బేస్‌బాల్ టైటిల్

Baseball title for Telangana

 

మన తెలంగాణ/హైదరాబాద్: జాతీయ సీనియర్ బేస్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ పురుషుల జట్టు టైటిల్‌ను గెలుచుకుంది. కర్నూలు జిల్లాలోని నంద్యాలలో ఈ పోటీలు జరిగాయి. పురుషులు, మహిళల విభాగంలో జరిగిన పోటీల్లో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన జట్లు పోటీ పడ్డాయి. ఇక పురుషుల విభాగంలో తెలంగాణ విజేతగా నిలిచింది. ఫైనల్లో తెలంగాణ ఐదు పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించింది. తెలంగాణ 11 పరుగులు చేయగా, ఢిల్లీ ఆరు పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఇక విజేతగా నిలిచిన తెలంగాణ జట్టుకు జాతీయ బేస్‌బాల్ సమాఖ్య కార్యదర్శి శ్వేత ట్రోఫీని బహూకరించారు.