Wednesday, May 15, 2024

యుఎస్ డెస్ట్రాయర్ ను తరిమికొట్టిన చైనా

- Advertisement -
- Advertisement -

 

China repelled US destroyer

 

బీజింగ్: దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద పారాసెల్ దీవుల సమీపంలో జూలై 13న  ఒక అమెరికా డిస్ట్రాయర్ ప్రయాణించడంపై బీజింగ్ నుండి తీవ్రంగా స్పందించింది.   చట్టవిరుద్ధంగా తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన తర్వాత అమెరికా డెస్ట్రాయర్ ను  సైన్యం ఓడను “తరిమికొట్టిందని” పేర్కొంది. చైనా మరియు ఇతర క్లైంట్లు విధించిన సముద్ర మార్గంపై ఆంక్షలను  సవాలు చేస్తూ అమెరికా దక్షిణ చైనా సముద్రంలో ‘ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆపరేషన్స్’ అని పిలిచే నౌకాయానాన్ని  క్రమం తప్పకుండా నిర్వహిస్తుంది. యుఎస్ నేవీ యొక్క 7వ ఫ్లీట్ కూడా నౌకాయానాన్ని ధృవీకరించింది.  యుఎస్ఎస్ బెన్ఫోల్డ్ గైడెడ్-మిసైల్ డిస్ట్రాయర్ చైనా, తైవాన్, వియత్నాం క్లెయిమ్ చేస్తున్న పారాసెల్ దీవుల సమీపంలో “ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆపరేషన్” నిర్వహించిందని పేర్కొంది. చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యొక్క సదరన్ థియేటర్ కమాండ్ ఒక ప్రకటనలో… ”బెన్‌ఫోల్డ్‌ చైనీస్ ప్రాదేశిక జలాల్లోకి చట్టవిరుద్ధంగా అతిక్రమించింది” అని పేర్కొంది. బెన్‌ఫోల్డ్‌ను “ట్రాక్ చేయడానికి ,  హెచ్చరించడానికి” వాయు, నావికా దళాలను పంపినట్లు కూడా చైనా తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News