Wednesday, May 1, 2024

పెట్రోల్, డీజిల్‌పై రూపాయి పన్ను తగ్గించిన బెంగాల్

- Advertisement -
- Advertisement -

Bengal cuts rupee tax on petrol and diesel

 

కోల్‌కతా: బెంగాల్‌లోని మమతాబెనర్జీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు ఒక్క రూపాయి చొప్పున పన్నులు తగ్గించింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి తగ్గించిన పన్ను అమలులోకి వస్తుందని ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి అమిత్‌మిత్రా తెలిపారు. పన్నుల రూపంలో లీటర్ పెట్రోల్‌పై కేంద్రం రూ.32.90 సంపాదిస్తుంటే, రాష్ట్రం తన వాటా కింద రూ.18.46, డీజిల్‌పై కేంద్రం రూ.31.80 సంపాదిస్తుంటే, రాష్ట్రం రూ.12.77 మాత్రమే తీసుకుంటుందని మిత్రా తెలిపారు. రాష్ట్రాల ఆదాయాన్ని దెబ్బతీస్తూ కేంద్రం సెస్ వసూలు చేస్తోంది, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన విమర్శించారు. ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News