Friday, April 26, 2024

జిఎస్‌టిలో రూ.2లక్షల కోట్ల గోల్‌మాల్..

- Advertisement -
- Advertisement -

జిఎస్‌టిలో రూ.2లక్షల కోట్ల గోల్‌మాల్
అధికార గణాంకాల చిట్టాల నిజాలే
ఆర్థికవేత్త డాక్టర్ అమిత్ మిత్రా వెల్లడి
సమాఖ్యవాద పరిధి దాటి వ్యవహారాలు
కోల్‌కతా: కేంద్రంలోని మోడీ ప్రభుత్వపు నూతన దర్శకత్వంలో రూపొందిన వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)లో దాదాపు రూ.2 లక్షల కోట్ల భారీ మోసం జరిగిందని పశ్చిమబెంగాల్ మాజీ ఆర్థిక మంత్రి, ప్రముఖ ఆర్ధికవేత్త డాక్టర్ అమిత్ మిత్రా ఆరోపించారు. జిఎస్‌టి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇప్పటివరకూ ఈ పన్నులు సేవల వసూళ్ల క్రమంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయనే విషయాన్ని తాను కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రాతిపదికనే తెలియచేస్తున్నానని చెప్పారు.

శనివారం ఆయన స్థానికంగా పశ్చిమ బెంగాల్ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ జురిడిషియల్ సైన్సెస్ (ఎన్‌యుజెఎస్)లో జిఎస్‌టి గురించి జరిగిన జాతీయ సదస్సులో ప్రసంగించారు. జిఎస్‌టి వాతావరణం పూర్తిగా విషపూరితంగా కంగాళిగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.మొత్తం మీద ప్రముఖ పారిశ్రామికవేత్త నందన్ నిలేకని జిఎస్‌టి మండలికి ఇచ్చిన ప్రజెంటేషన్ ప్రకారం చూస్తే పలు స్థాయిల్లో జిఎస్‌టిలో మోసాల స్థాయి 2020 నాటికి రూ.70000 కోట్లు అని మిత్రా తెలిపారు.

ఇది ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ ఫ్రాడ్‌గా మరోటి అండర్ డిక్లరేషన్ రకం మోసంగా రెండు రకాలుగా సాగిందని తెలిపారు. జిఎస్‌టి ముందుకు వచ్చిన ఈ వివరణాత్మక సమాచారం గురించి మండలి కనీసం ప్రస్తావించలేదని మిత్రా తెలిపారు. 2020 తరువాత అప్పట్లో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో జిఎస్‌టి మోసాల గణాంకాలు వెలువరించారని గుర్తు చేశారు. 2020 తరువాత జరిగిన అవకతవకల మొత్తం రూ.55,575కోట్లుగా తెలిందని, తాను సరైన గణాంకాలను రాజ్యసభలో ఇచ్చిన సమాధానం ఆధారంగా తాను చెపుతున్నానని ఈ మొత్తం ఏకంగా రూ 1.25 లక్షల కోట్ల వరకూ ఉంటుందని మిత్రా తెలిపారు. నిలేకని ఆ తరువాత కేంద్ర ప్రభుత్వ లెక్కలతో కలిస్తే ఆ తరువాత రాష్ట్రాల అవకతవకల లెక్కలు కూడా జత అయితే జిఎస్‌టి ఫ్రాడ్ విలువ ఏకంగా రూ 2లక్షల కోట్ల స్థాయిలో ఉంటుందని మిత్రా తెలిపారు.

జిఎస్‌టి ముందుంది పూర్తి శూన్యస్థితి
సరైన దిశలో జిఎస్‌టి పయనం లేనందున ఇకపై దీని పురోగతి శూన్యమే అవుతుందని ఆయన విశ్లేషించారు. జిఎస్‌టి మండలి పూర్తిగా గందరగోళంగా మారిందని విమర్శించారు. గత ఐదేళ్లలో జిఎస్‌టి కౌన్సిల్ పనితీరు బహురీతులలో మారిందని తెలిపిన మిత్రా ఈ తీరెతెన్నులను విశ్లేషించారు. దేశంలో నూతన పన్నుల వ్యవస్థ జిఎస్‌టి 2017లో ఉనికిలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ జరిగిన అంతర్గత పరిణామాలను మిత్రా తెలిపారు. ఈ సందర్భంగా 2017లో జరిగిన జిఎస్‌టి పరిణామం గురించి ఆయన వివరించారు. అప్పట్లో 12 కిలోమీటర్ల తీరప్రాంతానికి పన్నుల విధింపు అంశం రగులుతూ వచ్చింది.

ఈ దశలో ఎనిమిది రాష్ట్రాలకు వేర్వేరు రాజకీయ పార్టీలు అధికారాల్లో ఉన్నాయి. ఈ పార్టీల ప్రభుత్వాలన్ని తీర ప్రాంతపు పన్నులపై ఒక్కటయ్యాయి. ఆ దశలో గుజరాత్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నితిన్ పటేల్ అనుకుంటా, ఆయన తన వద్దకు వచ్చి సమస్యను పరిష్కరించేందుకు ముందుకు రావాలని తనను కోరారని డాక్టర్ మిత్రా తెలిపారు. బిజెపి తరఫున తాను మద్దతు ఇస్తానని చెప్పారని వివరించారు. కర్నాటకలో అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తమిళనాడు, కేరళ ఈ విధంగా వేర్వేరు పార్టీల ప్రభుత్వాలు అధికారంలో ఉన్న దశలో అన్ని రాజకీయ పార్టీలు తమ విభేదాలను వీడి ఈ తీర ప్రాంత పన్నుల విషయంలో ఉమ్మడి ప్రయోజనాల దిశలో ఒక్కతీరానికి చేరాయని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీని తాను దీని గురించి కలిశానని, ఆయన దీనిపై చొరవ తీసుకున్నారు.

ఈ అంశంలో మొత్తం పన్నుల విధింపు ప్రక్రియ కేవలం కేంద్రం పరిధిలోనే ఉండకుండా చూస్తామని తెలిపారని, ఈ విధంగా అప్పట్లో జిఎస్‌టిలో సరైన వాతావరణం ఉండేదని వివరించారు. మిత్రా ప్రస్తుతం పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుడిగా సేవలు అందిస్తున్నారు. జిఎస్‌టిపై నిర్థిష్టమైన వైఖరి లేని పార్టీ కేవలం బిజెపినే అని మిత్రా తెలిపారు. తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు విజ్ఞాన్‌భవన్‌లో జిఎస్‌టి మండలి భేటీ జరిగిందని, అయితే అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి జిఎస్‌టిని పూర్తిగా వ్యతిరేకించారని, ఆ వ్యక్తే ఇప్పుడు దేశానికి ప్రధాని అయ్యారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News