Sunday, April 28, 2024

మమతకు మరో ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

Bengal sports minister Laxmi Ratan Shukla resigns

బెంగాల్‌లో మరో మంత్రి రాజీనామా

కోల్‌కత: పశ్చిమ బెంగాల్ యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి రతన్ శుక్లా మంగళవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. శుక్లా తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, లేఖ ప్రతిని గవర్నర్ జగదీప్ ధన్కర్‌కు పంపినట్లు సచివాలయం వర్గాలు తెలిపాయి. రాష్ట్ర రవాణా మంత్రి సువేందు అధికారి టిఎంసికి రాజీనామా చేసి బిజెపిలో చేరిన పక్షం రోజుల్లో మరో మంత్రి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. బెంగాల్ రంజీ టీమ్ మాజీ కెప్టెన్ అయిన 39 సంవత్సరాల శుక్లా హౌరా(ఉత్తర) స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజకీయాల నుంచి రిటైర్ కావాలని ఆశిస్తున్నట్లు తన రాజీనామా లేఖలో శుక్లా పేర్కొన్నట్లు వర్గాలు తెలిపాయి. హౌరా జిల్లాలో టిఎంసి ఇన్‌చార్జ్‌గా ఉన్న శుక్లా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదని వర్గాలు చెప్పాయి.

Bengal sports minister Laxmi Ratan Shukla resigns

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News