Tuesday, April 30, 2024

ప్రైవేటుకు దీటుగా ఆర్థో సేవలు

- Advertisement -
- Advertisement -

Better orthopedic services for poor people:Harish rao

పేదలకు మరింత మెరుగైన ఆర్థోపెడిక్ చికిత్స

సర్కారు దవాఖానాల్లోనే
మోకాలి చిప్ప మార్పిడి
సర్జరీలు జరగేలా చూడాలి
అన్ని ఆసుపత్రులకు తగినంత
బడ్జెట్ ఇచ్చాం ఆసుపత్రుల
అభివృద్ధికి ఆరోగ్య శ్రీ నిధులు
విడుదల చేశాం
నిధులను వినియోగించుకుని
ఆసుపత్రుల్లో
తగిన ఏర్పాట్లు చేసుకోవాలి
జిల్లా ఆసుపత్రుల్లో అధునాతన
వైద్య పరికరాలను
సమకూర్చాం అక్కడే
మెరుగైన వైద్యసేవలందించాలి
: వైద్య ఆరోగ్య శాఖ
మంత్రి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పేద ప్రజలకు మరింత మెరుగైన ఆర్థోపెడిక్ సేవలు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో ప్రభుత్వ, ప్రముఖ ప్రైవే టు ఆర్ధోపెడిక్ వైద్యులతో మంత్రి హరీశ్‌రావు సమావేశమయ్యారు. రాష్ట్రంలో అందిస్తున్న ఆర్థోపెడిక్ సేవల గురించి మంత్రి సమీక్షించారు. ఈ విభాగంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు అవసరమైన నూతన వైద్య విధానాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆర్థో వైద్య నిపుణుల సలహాలు తీసుకున్నారు. సమావేశంలోవైద్యారోగ్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి, టిఎస్‌ఎంఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్,డిఎంఇ రమేశ్ రెడ్డి, నిమ్స్, రిమ్స్, మహబూబ్‌నగర్, సిద్ధిపేట్ దవాఖానాల డైరెక్టర్‌లు, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, అన్ని మెడికల్ కాలేజీ హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, ఆర్థోపెడిక్ విభాగాధిపతులు, ఆర్థోపెడిక్ డాక్టర్లు, జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, జిల్లా ఆసుపత్రి ఆర్థోపెడిక్ డాక్టర్లు పాల్గొన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల నుంచి ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ డా.గురువారెడ్డి, డా. అఖిల్ దాడి, డాక్టర్ సూర్య ప్రకాష్, డాక్టర్ నితిన్, డాక్టర్ ప్రవీణ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, అన్ని ఆసుపత్రులకు తగినంత బడ్జెట్ ఇచ్చామని, ఆసుపత్రుల అభివృద్ధి కోసం ఆరోగ్య శ్రీ కింద నిధులను విడుద ల చేశామని అన్నారు. ఈ నిధులను స్థానికంగా సూపరింటెండెంట్లు వినియోగించుకొని ఎప్పటికప్పుడు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. ప్రైవేట్ హాస్పిటళ్లతో పోటీ పడి ప్రభుత్వ హాస్పిటల్స్ లో అర్ధోపెడిక్ వైద్య సేవలు అందించాలని చెప్పా రు. మోకాలి చిప్ప మార్పిడి సర్జరీకి కావాల్సిన అ న్ని వసతులను ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమకూర్చామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56 సీఆర్మ్ మిష న్లు ఏర్పాటు చేశామని, మోకాలి చిప్ప మార్పిడి సర్జరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగేలా చూడాలని అన్నారు. దీని వల్ల పేద ప్రజలకు ఆర్థిక భారం తప్పుతుందని తెలిపారు. సూపరిడెంట్లు అర్ధోపెడిక్ వైద్యులకు సహకారం అందించాలని చెప్పారు.

హైదరాబాద్‌కు రిఫర్ చేయొద్దు

పేద ప్రజలకు వైద్యం అందించే మనందరి బాధ్యత అని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. జిల్లాల్లో ఉన్న పెద్ద ఆసుపత్రులు కూడా హైదరాబాద్‌కు రిఫర్ చేస్తున్నారని, ఇలా రిఫర్ చేయకుండా ఆ జిల్లా ఆసుపత్రుల్లోనే వైద్యం అందించాలని పేర్కొన్నారు. అక్కడ అందించలేని చికిత్సలకు మాత్రమే హైదరాబాద్‌కు రెఫర్ చేయాలని తెలిపారు. జిల్లా ఆసుపత్రులను బలోపేతం చేశామని, అధునాతనమైన వైద్య పరికరాలను సమకూర్చామని అన్నారు. అన్ని రకాల ఆర్థోపెడిక్ చికిత్సలకు ఆరోగ్య శ్రీ పథకం కింద అవకాశం ఉందని పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్నారని, వారికి తగిన ఏర్పాట్లు చేశామని చెప్పారు. అందరు సూపరింటెండెంట్లు, డైరెక్టర్లు సంబంధిత విభాగాల డాక్టర్లు, సిబ్బందితో సమావేశాలు ఏర్పాటు చేసుకొని, ఆసుపత్రి అవసరాల గురించి చర్చించుకోవాలని సూచించారు. చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలని తెలిపారు. తమ పరిధిలో పరిష్కరించుకోలేని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించే క్రమంలో ఎలాంటి అవసరాలనైనా తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అందుకోసం బట్జెట్‌లో వైద్య పరికరాలకు రూ.500 కోట్లు, సర్జికల్‌కు రూ. 200 కోట్లు, వైద్య పరీక్షలకు రూ.300 కోట్లు, మందులకు రూ.500 కోట్లు, ఆసుపత్రుల అభివృద్ధికి రూ.1,250 కోట్లు కేటాయించామని చెప్పారు.

ఉత్తమ వైద్యసేవలందించే వైద్యులు, సిబ్బందికి అవార్డులు

రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ వైద్య సేవలు అందించే వైద్యులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లకు, ఇతర సిబ్బందికి అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తామని మంత్రి వెల్లడించారు. అందరూ మరింత కష్టపడి పని చేసి పేదలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆర్థోపెడిక్ వైద్యులు పలు సూచనలు చేశారు. అవసరమైన సమయంలో తమ వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆయా ఆసుపత్రుల్లో పనితీరు గురించి వివరించారు. అదే విధానాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనుసరిస్తే మరింత ఎక్కువ మంది పేషెంట్లకు ప్రస్తుతం ఉన్న సదుపాయాలతో సేవలందించవచ్చని వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు.

ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తాం : డాక్టర్ గురువారెడ్డి

తమ ఆసుపత్రుల్లో ప్రణాళికాబద్ధమైన విధానం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మందికి చికిత్స ఇవ్వగలుగుతున్నామని ప్రముఖ అర్ధోపెడిక్ వైద్యులు గురువారెడ్డి చెప్పారు. ఇదే పద్ధతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆచరిస్తే, ఇంకా ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చుతుందన్నారు. ప్రభుత్వానికి ఏ సమయంలోనైనా సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగంలో సేవలు మెరుగుపరిచేందుకు ప్రైవేట్ వైద్య నిపుణులను సైతం పిలిచి సలహాలు సూచనలు తీసుకోవడం మంచి పరిణామం అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. అర్ధోపెడిక్ వైద్యుడు అఖిల్ దాడి మాట్లాడుతూ.. వైద్యులు అంకిత భావంతో ఉండి ఎక్కువ సమయం పేషెంట్ల కోసం కేటాయిస్తే ఎక్కువ మందికి సేవలు అందించడం సాధ్యమవుతుందన్నారు. డాక్టర్ నితిన్ మాట్లాడుతూ,నూతన చికిత్స విధానాలపై పరిశోధనకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. దాని వల్ల వైద్యులకు ఆసక్తి పెరుగుతుందని, తద్వారా పేషెంట్లకు మెరుగైన చికిత్స అందుతుందని తెలిపారు.

ఆపరేషన్ థియేటర్ల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, దాని ద్వారా ఎక్కువ మంది పేషెంట్లకు సేవలందుతాయని చెప్పారు. డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ, ఉస్మానియా, గాం ధీ వంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎంతో గొప్ప వై ద్యులు ఉన్నారని, నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. మరింత మంచి సేవలు అందించే అవకాశం ఉందని చెప్పారు. డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ.. అన్ని విభాగాలు సమన్వయంతో ఎక్కువ మందికి సేవలందించవచ్చని పే ర్కొన్నారు. డాక్టర్ సూర్య ప్రకాశ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఇంకా ఎక్కువ సర్జరీ లు జరగాలని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంలో సమావేశానికి హాజరై విలువైన సూచనలు, సలహాలు ఇచ్చిన వైద్యులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News