Tuesday, April 30, 2024

బస్తీ దవాఖానాలు.. ప్రజల ఆరోగ్యానికి దోస్తీ దవాఖానాలు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: సిద్దిపేట పట్టణం16వ వార్డ్ లోని ఇందిరమ్మ కాలనీలో బస్తీదవాఖానను మంత్రి హరీష్ రావు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ.. బస్తీ ఆసుపత్రితో సుస్తీకి ఇక స్వస్తి చెప్పాలన్నారు. బస్తీదవాఖానలు ప్రజల ఆరోగ్యానికి దోస్తీ దవాఖానాలు అయ్యాయని మంత్రి పేర్కొన్నారు. ఇందిరమ్మ కాలనీ పేద ప్రజలకు సుస్తీ అయితే బస్తీ దవాఖాన నయం చేస్తుందన్నారు. ఈ దవాఖానలో 158 రకాల మందులు ఇచ్చి, 57 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. త్వరలోనే 137రకాల పరీక్షలు కూడా నిర్వహిస్తారు.. రోగాన్ని గుర్తించి మందులు వాడితే దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా ఉండవచ్చని చెప్పుకొచ్చారు.

హైదరాబాద్ లో 354 బస్తీ దవాఖానలు ఉన్నాయి. పేదలకు వైద్యం అందించాలని అన్ని జిల్లాలలో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సిద్దిపేట లో 5 బస్తీ దవాఖానలు ఉన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృదా చేసుకోవద్దు, ప్రభుత్వ ఆసుపత్రులను సద్వినియోగం చేసుకోవాలిఆయన సూచించారు. బస్తీ దవాఖానలు పేద ప్రజలకు దోస్తీ దవాఖానలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో వైద్యరంగాన్ని మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు. సిద్దిపేటలో పాలియేటివ్ కేర్ ను అందుబాటులోకి తెచ్చాం, బీపీ,షుగర్ రోగస్తులకు ఎన్ సిడి కిట్ అందిస్తున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News