Monday, April 29, 2024

78 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం: భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

మధిర : రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ సునామీగా వస్తున్నదని, 78 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తదనీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. నెల రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఆ ప్రభుత్వ ఏర్పాటులో మధిర దశా దిశ నిర్దేశించేదిగా ఉండటానికి తనను నాలుగోసారి ఎమ్మెల్యేగా దీవించాలని కోటర్లకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మధిర పట్టణంలోని నందిగామ, కళామందిర్ రోడ్డు, మెయిన్ రోడ్డు, రాయపట్నం సెంటర్లో ని షాప్ టు షాప్ ప్రచారం నిర్వహించారు. ప్రతి దుకాణం యజమాని, కస్టమర్లు, బాటసారులను కలుసుకుని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ యార్డ్ లో రోడ్డు పక్కన ఉన్న స్ట్రీట్ వెండర్స్ వద్దకు వెళ్లి వారి యోగ క్షేమాలు అడిగి చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అంతకు ముందు ఉదయం మధిర చెరువు కట్టపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మార్నింగ్ వాక్ ప్రచారం చేశారు.

మార్నింగ్ వాకర్స్, స్విమ్మర్స్ తో సమావేశమయ్యారు ఈ సందర్భంగా వారు భట్టి విక్రమార్క కి పూలమాలవేసి శాలువా కప్పి ఆయన చిత్రపటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంపద ప్రజలకు పంచాలని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ప్రకటించిన 6 గ్యారంటీలు అమలు చేయించే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. మధిర సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని, మధిరలో చెరువులను టూరిజం హబ్ గా తీర్చిదిద్దడంతో పాటు మత్స్య అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. ఫాస్ట్ గ్రోయింగ్ సిటీగా మధిరను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రానున్న ఐదేళ్లు పనిచేస్తానని చెప్పారు. మధిరకు ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయడానికి మాస్టర్ ప్రణాళికను రూపొందించానని, మధిరను సుందరమైన పట్టణంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు.

పత్తి, మిర్చి, వరి, పసుపు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. మధిర బిడ్డగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల గౌరవాన్ని పెంచానే తప్ప ఎక్కడ తగ్గించలేదన్నారు. మధిర ప్రజల బలం, ఓటర్ల ఆశీర్వాదం వల్లనే సీఎల్పీ లీడర్ గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు తెలంగాణలో పీపుల్స్ ప్రభుత్వం రావాలని ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేశానని చెప్పారు. ఓటు వేసిన మధిర ప్రజలు తలదించుకునేలా చిల్లర మల్లర రాజకీయాలు ఎన్నడు తాను చేయలేదని, మధిర ప్రజలు తల ఎత్తుకొని చూసేలా, నిత్యం పతాక శీర్షికలో ఉండే విధంగా ప్రతిపక్ష నాయకుడిగా చట్ట సభలో ప్రజల గొంతుకగా ప్రభుత్వాన్ని ప్రశ్నించి, ప్రభుత్వం మెడలు వంచి ప్రజా సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేసినట్లు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News