Monday, May 13, 2024

‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ వచ్చేసింది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ సర్ ప్రైజ్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు ‘భీమ్లా నాయక్’. గురువారం పవన్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మూవీ టైటిల్ సాంగ్ ను సోషల్ మీడియాలో విడుదల చేసింది. థమన్ సంగీత స్వరాలు అందించాడు. ముఖ్యంగా ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రీ అందించగా లిరిక్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి. తాజాగా విడుదలైన ఈ పాట అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. పవన్ ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా.. ఆయనకు జోడీ నిత్యా మీనన్ నటిస్తోంది. సితార ఎంటర్ టైన్మెంట్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

‘Bhimla Nayak’ Title Song released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News