Monday, May 6, 2024

అనంతపురంలో భారీ అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

అమరావతి:అనంతపురంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం జేఎన్టీయూ కాలేజ్ ఎదురుగా ఉన్న సూపర్‌ మార్కెట్‌ ప్రారంభోత్సవానికి కొన్ని గంటల ముందే అగ్నికి ఆహుతైంది. ఈ రోజు తెల్లవారుజామున ప్రమాదవశాత్తు సూపర్‌మార్కెట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ జరగడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. అప్పటికే పెద్ద ఎత్తున మంటలు అలుముకోవడంతో మార్కెట్‌లో ఉన్న దాదాపు రూ.60 లక్షల నిత్యావసర వస్తువులన్నీ పూర్తిగా దగ్ధం అయ్యాయి.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Fire broke out at Supermarket in Anantapur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News