Wednesday, May 1, 2024

ప్రారంభమైన బీహార్ తొలి విడత పోలింగ్

- Advertisement -
- Advertisement -

Bihar first phase of polling begins

 

పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బుధవారం 71 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలింగ్ జరగనుంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు జిల్లాల్లోని 71  శాసనసభ స్థానాల్లో పోలింగ్ జరుగనుంది.  తొలివిడుత ఎన్నికల బరిలో 1066 మంది అభ్యర్థులు నిలిచారు. ఆర్జేడీ 42, జేడీయూ 42, ఎల్జేపీ 41, బీజేపీ 29, కాంగ్రెస్‌ 21 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు  కూటమిగా పోటీ చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ), జనతాదళ్ యునైటెడ్ మరో కూటమిగా పోటీకి దిగాయి.

కాగా తొలివిడతలో ఓటు వేయనున్న 2.14 మంది ఓటర్లలో 1.01 కోట్ల మంది మహిళలు కాగా, 599 మంది ట్రాన్స్ జెండర్లున్నట్లు ఎన్నికల కమిషన్ లెక్కలను బట్టి తెలుస్తోంది. తొలివిడత బరిలో ఉన్న ప్రముఖుల్లో జముయినుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణపతక విజేత, షూటర్ శ్రేయాసి సింగ్(27) ఉన్నారు. సిట్టింగ్ ఎంఎల్‌ఎ, మాజీ కేంద్ర మంత్రి జైప్రకాశ్ నారాయణ్ యాదవ్ సోదరుడు విజయ్ ప్రకాశ్ యాదవ్ ఆమె ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు. జైప్రకాశ్ నారాయణ్ కుమార్తె 28 ఏళ్ల దివ్యాప్రకాశ్ పొరుగున ఉన్న తారాపూర్ నియోజకవర్గంనుంచి ఆ పార్టీ అభ్యర్థినిగా తొలిసారి పోటీ చేస్తున్నారు. నితీశ్ మంత్రివర్గంలోని ఆరుగురు మంత్రులు కూడా తొలి విడత బరిలో ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News