Wednesday, May 1, 2024

సిఎం సహాయనిధికి భారత్ బయోటెక్ రూ.2 కోట్ల విరాళం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్‌ను కట్టడి నిమిత్తం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమవంతు సాయంగా భారత్ బయోటెక్ కంపెనీ రూ.2 కోట్ల భారీ విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించింది. దీనికి సంబంధించిన చెక్కును కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎమ్. ఎల్లా, కో ఫౌండర్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర కె.ఎల్లా, ప్రెసిడెంట్ సాయి డి. ప్రసాద్ మంగళవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు అందించారు. కరోనా వైరస్ నిర్మూలనకు త్వరలోనే వ్యాక్సిన్ ను ఆవిష్కరించనున్నట్లు కంపెనీ చైర్మన్ కృష్ణ ఎమ్. ఎల్లా తెలిపారు.
ఎంపిపి, ఎంపిటిసిలు, మండల టిఆర్‌ఎస్ నాయకులు విరాళం అందచేత
ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివనగర్ మండల ఎంపిపి, ఎంపిటిసిలు, మండల టిఆర్‌ఎస్ నాయకులు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ప్రకటించిన 2లక్షల 6 వేల రూపాయల చెక్కును మంత్రి కెటిఆర్‌కు స్థానిక ఎమ్మెల్యే జాజల సురేందర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత కవితలు కలిసి అందచేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News