Friday, April 26, 2024

మంచి నీటిపై అధికారుల నిఘా

- Advertisement -
- Advertisement -

water bottles

 

వాటర్ బాటిల్స్ విక్రయాలపై బిఐఎస్ ప్రత్యేక దృష్టి
ఫేక్ బ్రాండ్లను అరికట్టేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళికలు
ఇప్పటికే హైదరాబాద్ రీజన్‌లో 717 శాంపిల్స్ సేకరణ
110 అన్‌సేఫ్, 15 కంపెనీలు లైసెన్స్ లేకుండా విక్రయాలు జరుపుతున్నట్లు గుర్తింపు

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతి రోజూ పరిశుభ్రమైన నీటిని తీసుకోవడం వలన రోగాల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్ (బిఐఎస్) సూచిస్తుంది. ప్రస్తుతం ప్రబలుతున్న రోగాల్లో ఎక్కువ శాతం పరిశుభ్రమైన త్రాగునీటిని తీసుకోలేకపోవడం వలనే వస్తున్నాయని బిఐఎస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. వేసవికాలం ప్రారంభమైన తరుణంలో పరిశుభ్రమైన నీటిని మాత్రమే తీసుకోవాలని బిఐఎస్ శాస్త్రవేత్తలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్లలో లభించే వాటర్‌బాటిల్స్ పై బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈక్రమంలో2017 నుంచి 2019 డిసెంబర్ వరకు వివిధ వాటర్ బాటిల్స్ తయారీ సంస్థల నుంచి సేకరించిన శాంపిల్స్‌ను పరిశీలించగా, హైదరాబాద్ రీజన్‌లో లభించే వాటిలోనే ఎక్కువ శాతం పరిశుభ్రంగా లేవని బిఐఎస్ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ రీజన్‌లో 717 శాంపిల్స్‌ను తీసుకోగ, సుమారు 110 శాంపిల్స్ అన్‌సేఫ్ ఉన్నట్లు బిఐఎస్ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

ఇవికాక మరో 15 కంపెనీలు లైసెన్స్ లేకుండా వాటర్ బాటిల్స్ తయారు చేస్తూ విక్రయిస్తున్నారని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఫేక్ బ్రాండ్లతో విక్రయాలు చేస్తున్న కంపెనీలను అరికట్టేందుకు రాబోయే రోజుల్లో స్పెషల్ డ్రైవ్‌లు సైతం చేపట్టనున్నట్లు బిఐఎస్ సైంటిస్ట్ అమీర్ ఉజ్ జమాన్ తెలిపారు. బహిరంగ మార్కెట్లలో లభించే వాటర్‌బాటిల్స్ కొనుగోలు చేసేటపుడు ఖచ్చితంగా ఐఎస్‌ఐ మార్క్ ఉన్నవి మాత్రమే కొనాలని ఆయన చెప్పారు. ఒకవేళ ఐఎస్‌ఐ మార్క్‌లేని వాటర్ బాటిల్స్ ఎక్కడైనా విక్రయిస్తున్నట్లు తెలిసినా, చూసినా బిఐఎస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని అమీర్ ఉజ్ జమాన్ పేర్కొన్నారు.

500 ఎంఎల్, లీటర్ వాటర్ బాటిల్స్ లోనే ఎక్కువ కల్తీ…
సాధారణంగా ప్రజలు వాటర్ బాటిల్స్ కొనుగోలు చేయాలంటే ఎక్కువ శాతం 500ఎంఎల్, 1 లీటర్ బాటిళ్లను అత్యధికంగా కొనుగోలు చేస్తుంటారు. దీన్ని అదనుగా కొన్ని ఫేక్ కంపెనీలు లోకల్ నీటిని నింపి బిఐఎస్ సర్టిఫికేట్ బ్రాండ్ల కంపెనీల పేర్లు కలిసేలా ఇతర లోగోలు పెట్టి బాటిల్స్‌ను విక్రయిస్తున్నారు. చాలా మంది బాటిల్స్‌ను పూర్తిస్థాయిలో పరిశీలించకుండా కొని త్రాగేస్తుంటారు. వీటితో అత్యంత ప్రమాదమని సైంటిస్టులు చెబుతున్నరు. సరైన మినరల్స్ లేకుండా విక్రయించే వాటర్ వాటిల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లో కోనుగోలు చేయకూడదని అధికారులు సూచిస్తున్నారు.

వాటర్ బాటిల్స్ కొనేటప్పుడు పరిశీలించాల్సిన ముఖ్యమైన అంశాలు…
బయట మార్కెట్లలో వాటర్ బాటిల్స్ కొనేటపుడు ముఖ్యంగా ఐఎస్‌ఐ మార్క్‌ను గమనించాలి. దీంతో పాటు ఆ బాటిల్‌ను ఏ సంస్థ తయారు చేసింది? తయారీ యూనిట్ ఏ ప్రాంతంలో ఉంది? ఆ బ్రాండ్‌కు బిఐఎస్‌కు పరిశీలించినట్లు ఏవైనా వివరాలు బాటిల్ లోగోపై ఉందా లేదా చూడాలి. వాస్తవంగా లీటర్ వాటర్‌లో పిహెచ్ వాల్యూ 6.5 నుంచి 8.5 మధ్యలో ఉండాలి. అంతేగాక టర్బిలిటీ 1 శాతం,కాల్షియం కార్బోనేట్ (సిఎసిఓ౩) శాతం లీటర్ నీటిలో 200 మి.ల్లీ గ్రాములు దాటకుండా ఉండాలి. అదే విధంగా తయారీ, గడువు ముగింపు తేదిలను కూడా ఖచ్చితంగా పరిశీలించాలని నిపుణులు పేర్కొంటున్నారు.

ఫేక్ తయారీ బ్రాండ్లను అరికట్టేందుకు కృషి చేస్తున్నాం : అమీర్ ఉజ్‌జమాన్
వాటర్ బాటిల్స్ తయారీ సంస్థలు నిబంధనలు పాటించని యెడల ఖచ్చితంగా చర్యలు తీసుకునేలా ప్రణాళికలు చేపడుతున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు సైతం చేపడతాం. ఇప్పటికే గత రెండేళ్లలో సుమారు 717 శాంపిల్స్ సేకరించగా, దాదాపు 110 కంపెనీలను నుంచి తయారయ్యే వాటర్ బాటిల్స్ కనీన నిబంధనలు పాటించకుండా విక్రయిస్తున్నట్లు గుర్తించి సంబంధిత కంపెనీలకు నోటీసులు ఇచ్చాం. అదే విధంగా లైసెన్స్‌లు లేకుండా బాటిల్స్ తయారు చేస్తున్న మరో 15 కంపెనీల ఉత్పత్తులను నిలిపివేసి, వాటి తయారీ యూనిట్లను సీజ్ చేశాం. ప్రజలు సైతం వాటర్ బాటిల్ కొనుగోలు చేసే సమయంలో అన్ని వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత మాత్రమే కొనుగోలు చేయాలి.

BIS special focus on water bottles sales
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News