Friday, April 26, 2024

జైలులో రాజాసింగ్.. రేపటితో ముగియనున్న సంజాయిషీ గడువు

- Advertisement -
- Advertisement -

BJP action on Raja Singh controversial comments

సంజాయిషీ ఇచ్చేందుకు గడువు పొడిగించాలని బిజెపికి రాజాసింగ్ భార్య లేఖ

హైదరాబాద్ : వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయి జైలులో ఉన్న గోషామహల్ ఎంఎల్‌ఎ రాజాసింగ్‌కు ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చింది. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో హైదరాబాద్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, పార్టీ నియమావళి ధిక్కరించి వీడియో విడుదల చేశారన్న ఆరోపణలతో రాజాసింగ్‌పై బిజెపి క్రమశిక్షణా కమిటీ నోటీసులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే రీతిలో ఉన్న మీ ప్రవర్తన ఆధారంగా మిమ్మల్ని పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో తెలపాలంటూ రాజాసింగ్‌కు బిజెపి నోటీసులు జారీ చేసిన సంగతి విదితమే. ఆ నోటీసుల ప్రకారం శుక్రవారం లోగా రాజాసింగ్ వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రస్తుతం జైలులో ఉన్న రాజాసింగ్ పార్టీ నోటీ సులకు వివరణ ఇచ్చే పరిస్థితి కనిపించడం లనేదు. దీంతో రంగంలోకి దిగిన రాజాసింగ్ భార్య బిజెపి క్రమశిక్షనా సంఘానికి ఓ లేఖ రాశారు. ప్రస్తుతం తన భర్త జైలులో ఉన్నారని, ఈ కారణంగా నిర్దేశిత సమయంలో నోటీసులకు వివరణ ఇచ్చే అవకాశం లేకుండా పోయిందని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. పార్టీ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు తన భర్తకు మరింత గడువు ఇవ్వాలని ఆమె పార్టీ క్రమశిక్షణా సంఘాన్ని అభ్యర్థిం చారు. రాజాసింగ్ భార్య రాసిన ఈ లేఖపై బిజెపి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News