Tuesday, May 21, 2024

ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్న బిజెపి: రాహుల్ ఆరోపణ

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: అధికార బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ దేశంలో ప్రజాస్వామ్యంపై దాడులు చేస్తూ విద్వేషాన్ని, హింసను వ్యాప్తి చేస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. సోమవారం కర్నాటకలోని భలీలో ఒక బహిరంగసభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చే విధంగా కనీసం 150 స్థానాల్లో గెలిపించాలని ప్రజలకు విజప్తి చేశారు.

12వ శతాబ్దానికి చెందిన సంఘ సంస్కర్త బసవన్నకు చెందింది ఈ బీదర్ అని రాహుల్ అన్నారు. ఈ గడ్డ మీద నుంచే మొదట ప్రజాస్వామిక విలువల గురించి బసవన్న మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆర్‌ఎస్‌ఎస్, బిజెపికి చెందిన నాయకులు ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
దేశంలో విద్వేషభావాలను, హింసను వ్యాప్తి చేస్తున్న బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు పేద, బలహీన వర్గాలకు చెందిన ప్రజల నుంచి డబ్బు కొల్లగొడుతూ ఒకరిద్దరు సంపన్నులకు దోచిపెడుతున్నారని రాహుల్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News