Wednesday, May 1, 2024

అవినాశ్ రెడ్డి సిబిఐ విచారణలో చిన్న ట్విస్ట్!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాశ్ రెడ్డిని సిబిఐ నేడు విచారణకు పిలిచింది. ఆదివారం వై.ఎస్. భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశాక ఈ పరిణామం చోటుచేసుకుంది. సిబిఐ నోటీసు అందుకున్న అవినాశ్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తన తన నివాసం నుంచి విచారణ కోసం కాన్వాయ్‌లో బయల్దేరారు. అయితే ఇంతలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

మధ్యాహ్నం 3.00 గంటలకు విచారణకు హాజరుకావాలని సిబిఐ నోటీసివ్వగా…3.45 గంటలకు హైకోర్టులో అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 5.00 గంటల వరకు అవినాశ్‌ను విచారించొద్దని హైకోర్టు సిబిఐని ఆదేశించింది. తత్ఫలితంగా సిబిఐ సాంయత్రం 5.00 తర్వాతే విచారణకు పిలుస్తామని స్పష్టం చేసింది. కాగా రేపు ఉదయం(మంగళవారం) 10.00 గంటలకు రావాలని సిబిఐ అధికారులు అవినాశ్ రెడ్డికి తెలిపారని సమచారం. దాంతో సిబిఐ ఆఫీసు నుంచి అవినాశ్ వెనుదిరిగారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News