Tuesday, April 30, 2024

బిఆర్‌ఎస్‌కు బిజెపియే ప్రత్యామ్నాయం

- Advertisement -
- Advertisement -
ఆగస్టు ఒకటి నుంచి క్షేత్రస్థాయిలో ఉద్యమాలు
బిజెపి కోర్ కమిటీ నిర్ణయం

హైదరాబాద్ : రానున్న శాసనసభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పాలనకు చరమగీతం పాడేందుకు కార్యాచరణ చేపట్టాలని బిజెపి కోర్ కమిటీ నిర్ణయించింది. బిజెపి నాయకులు కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేయాలని నిర్ణయించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. సాయంత్రం జరిగిన పార్టీ ముఖ్యనాయకుల సమావేశంలో పలు కీలకాంశాలపై చర్చించారు.

రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. అందరినీ కలుపుకుని ముందుకెళ్తూ బిజెపిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి క్షేత్రస్థాయిలో ఉద్యమాలు ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. బిజెపికి మద్దతుగా ప్రజల మద్దతు కూడగట్టేందుకు కార్యక్రమాలకు రూపకల్పన చేయనున్నారు. ముఖ్యనేతలు ఎవరొచ్చినా.. దళితవాడల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ.. బిఆర్‌ఎస్ సర్కారు వారికి చేసిన మోసాన్ని తెలియజేసేలా చైతన్యం తీసుకురావాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. బిజెపి మాత్రమే తెలంగాణలో బిఆర్‌ఎస్ పార్టీని ఓడించగలదనే.. విశ్వాసం ప్రజల్లో బలంగా ఉందని.. దీనిని సద్వినియోగం చేసుకుంటూ.. అవినీతి, అక్రమ, కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News